ప్రపంచ అథ్లెటిక్స్ డే 2023: చరిత్ర, లక్ష్యాలను తెలుసుకోండి
ప్రతేయేడాది మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటారు. పిల్లలు, యువకుల్లో ఫిట్ నెస్ పట్ల అవగాహన పెంచడం, ముఖ్యంగా అథ్లెటిక్స్ ఆడేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ దినోత్సవాన్ని 1996లో ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ (IAAF) ప్రవేశపెట్టింది. ఈ ఏడాది అథ్లెటిక్స్ ప్రధాన థీమ్ 'అందరికీ అథ్లెటిక్స్- ఎ న్యూ బిగినింగ్'గా ప్రవేశపెట్టారు. పాఠశాలలు, సంస్థలలో అథ్లెటిక్స్‌ను ప్రాథమిక క్రీడగా ప్రోత్సహించడం, క్రీడల గురించి ప్రజలకు,యువకులకు అవగాహన కల్పించడమే దీని లక్ష్యం. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని 1996లో అప్పటి IAAF అధ్యక్షుడు ప్రిమో నెబియోలో ప్రవేశపెట్టారు.
విద్యార్థులు పతకాలు సాధించడమే అథ్లెటిక్స్ లక్ష్యం
అథ్లెటిక్స్ అనేది వాకింగ్, రన్నింగ్, త్రోయింగ్, జంపింగ్ వంటి క్రీడలను కలిగి ఉంటుంది. రోడ్ రన్నింగ్, రేస్ వాకింగ్, క్రాస్ కంట్రీ రన్నింగ్, అల్ట్రా రన్నింగ్, మౌంటన్ రన్నింగ్ మొదలైన వాటితో సహా అథ్లెటిక్స్ నిర్వహణకు IAAF బాధ్యత వహిస్తుంది. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ప్రాథమిక ఉద్దేశ్యం ఏమిటంటే విద్యార్థులు వారి చిన్ననాటి నుండి క్రీడలపై ఆసక్తి పెంచడమే. దీంతో ఒలింపిక్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు మొదలైన పెద్ద ఈవెంట్లలో పతకాలు సాధించే అవకాశం ఉంటుంది.