తన చిన్ననాటి కోచ్ కాళ్లు మొక్కిన విరాట్ కోహ్లీ
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా కనిపిస్తుంటాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కాస్త దురుసుగా ప్రవర్తించే కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. అత్మీయులతోనూ, స్నేహితులతోనూ ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు తలపడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. అయితే స్టేడియంలో ఉన్న తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ దగ్గరకు వెళ్లి.. అతడి కాళ్లకు నమస్కారం చేశాడు. అనంతరం ఇద్దురూ చాలా సేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు.
విరాట్ కోహ్లీకి ఎక్కడ నెగ్గాలో తెలుసు!
అయితే తన చిన్న నాటి కోచ్ కు కోహ్లీ దండం పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోహ్లీకి ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 55(46), డుప్లెసిస్ 45(32) పరుగులతో రాణించారు. లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ కేవలం 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ను ఆడి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు.