NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / జరిమానా చెల్లించడంలోనూ విరాట్ కోహ్లీ రికార్డు
    తదుపరి వార్తా కథనం
    జరిమానా చెల్లించడంలోనూ విరాట్ కోహ్లీ రికార్డు
    ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ

    జరిమానా చెల్లించడంలోనూ విరాట్ కోహ్లీ రికార్డు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2023
    10:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు.

    ఈ సీజన్ లో ఐదు అర్ధ సెంచరీలతో ఆర్సీబీ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఐపీఎల్‌లో 364 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు.

    అయితే విరాట్ కోహ్లీ ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడు సార్లు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. దీంతో మూడుసార్లు జరిమానా చెల్లించడం గమనార్హం.

    ఏప్రిల్ 17న చైన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ దూకుడుగా సంబరాలు చేసుకోవడంతో ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరం కారణంగా అప్పట్లో 12 లక్షలు జరిమానా విధించారు.

    Details

    ఎక్కువ మొత్తంలో జరిమానా చెల్లించిన కోహ్లీ

    ఏప్రిల్ 13న రాజస్థాన్ రాయల్స్ తో ఆర్సీబీ తలపడింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.25 లక్షలు జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు.

    మొన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించి లెవెల్-2 ఉల్లంఘనకు కోహ్లీకి ఆ మ్యాచ్ లో ఏకంగా 100శాతం జరిమానా పడింది. ఈ తప్పిదానికి ఏకంగా కోహ్లీకి రూ.1.07 కోట్లు జరిమానా విధించడం విశేషం.

    మొత్తంగా కోహ్లీ 1.42 కోట్లు జరిమానా చెల్లించాడు. లోమ్రార్ 95లక్షలు, ప్రభుదేశాయ్ 30 లక్షలు, కర్ణ శర్మ 50 లక్షలు, ఫిన్ అలెన్ రూ.80 లక్షలు ఇచ్చే దాని కంటే కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ జరిమానా కట్టాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    ఐపీఎల్

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    విరాట్ కోహ్లీ

    IND vs AUS, 2nd Test: విరాట్‌ కోహ్లి ఔట్‌పై రాజుకున్న వివాదం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    మరో రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ క్రికెట్
    కోహ్లీ, బాబర్‌ను అవుట్ చేయాలి : పాక్ స్టార్ పేసర్ క్రికెట్
    INDvsAUS : మళ్లీ నిరాశపరిచిన విరాట్ కోహ్లీ.. నిరుత్సాహంలో ఫ్యాన్స్ క్రికెట్

    ఐపీఎల్

    హైదరాబాద్‌తో పోరుకు ముందు చైన్నై సూపర్ న్యూస్.. మ్యాచ్ విన్నర్ రీ ఎంట్రీ! చైన్నై సూపర్ కింగ్స్
    రూ.18 కోట్లతో అనుభవం రాదు.. కర్రన్ పై సెహ్వాగ్ ఫైర్ వీరేంద్ర సెహ్వాగ్
    అర్జున్ టెండుల్కర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడు : పాక్ మాజీ క్రికెటర్ ముంబయి ఇండియన్స్
    IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ పై  చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సన్ రైజర్స్ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025