Loading...
Sindhu: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌.. సింధూకు సోఫియా తొలి సవాల్
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌.. సింధూకు సోఫియా తొలి సవాల్

Sindhu: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌.. సింధూకు సోఫియా తొలి సవాల్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు డ్రా మిశ్రమ ఫలితాలను అందించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన యువ ఆటగాడు ఆయుష్‌ శెట్టి తొలి రౌండ్‌లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోనున్నాడు. పురుషుల సింగిల్స్‌ ప్రారంభ పోరులో అతడు ప్రస్తుత ఛాంపియన్‌, చైనాకు చెందిన షి యు కితో తలపడనున్నాడు. ఇక భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌లకు తొలి దశలో అనుకూలమైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 141వ స్థానంలో ఉన్న ఐర్లాండ్‌ క్రీడాకారిణి సోఫియా నోబెల్‌తో సింధు తన టైటిల్‌ పోరాటాన్ని ప్రారంభించనుంది.

వివరాలు

ప్రపంచ నంబర్‌వన్‌‌తో పోటీ..

డ్రా ప్రకారం సింధుకు మెడల్‌ రౌండ్లకు ముందు ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సి యంగ్‌ (దక్షిణ కొరియా), డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అకానే యమగూచి (జపాన్‌) వంటి అగ్రశ్రేణి ప్రత్యర్థులు ఎదురయ్యే పరిస్థితి లేదు.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ తొలి రౌండ్‌లో ఆస్ట్రియాకు చెందిన ఫిలిమాన్‌తో పోటీ పడనున్నాడు.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే రెండో రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన కునన్లావ్‌తో తలపడే అవకాశం ఉంది.

వివరాలు

భారత్‌కు రెండు చొప్పున ఎంట్రీలు..

పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంటకు తొలి రౌండ్‌లో బై లభించింది.

దీంతో వారు నేరుగా రెండో రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు.

ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రతి విభాగంలో భారత్‌కు రెండు చొప్పున ఎంట్రీలు లభించాయి.

మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌, ట్రీసా జాలీ జోడీ తొలి రౌండ్‌లో స్పెయిన్‌కు చెందిన పౌలా లోపెజ్‌, లూసికా రోడ్రిగ్వెజ్‌ జంటతో తలపడనుంది.

ADVERTISEMENT