World Cup 2023 : ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా కమిన్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు వన్డే ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. అందులో భాగంగా ప్రాథమికంగా 18 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.
టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్న పాట్ కమిన్స్‌కే వన్డేలకు కెప్టెన్‌గా నియమించారు.
ఈ వన్డే ప్రపంచ కప్ టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా, టీమిండియా పర్యటనలకు ఈ 18 మందినే ఆసీస్ పంపనుంది. టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్న మార్నస్ లబుషన్ కు జట్టులోకి చోటు లభించలేదు.
ఆరోన్ హోర్గీ, తన్వీర్ సంగా అనే కొత్త ప్లేయర్లకు ఆసీస్ మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది.
Details
వన్డే వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే
ఇటీవల దేశవాళీ క్రికెట్లో ఆరోన్ హోర్డీ, తన్వీన్ సంగా అద్భుతంగా రాణిస్తున్నారు. తన్వీర్ 8 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాడు.
ఇక వన్డే వరల్డ్ కప్ లో ఆక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 8న ఆస్ట్రేలియా తన తొలి మ్యాచును టీమిండియాతో ఆడనుంది.
ఆస్ట్రేలియా జట్టు ఇదే
ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, మిచెల్ మార్ష్, గ్రెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంగా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.