
World Cup Final: టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా టార్గెట్ 241 పరుగులు
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియాకు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
తొలుతు టాస్ గెలిచిన ఆసీస్.. బౌలింగ్ ఎంచుకుని, రోహిత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన టీమిండియాకు తొలుత మంచి ఆరంభమే లభించినా.. రోహిత్ అవుట్ అయిన తర్వాత పిచ్ అనుకూలించకపోవడంతో రన్ రేట్ దారుణంగా పడిపోయింది.
టీమిండియా బ్యాటర్లలో 66 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టాప్ బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 47 పరుగులు, విరాట్ కోహ్లీ 54 పరుగులతో రాణించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీమిండియా 240 పరుగులు
ICC Men’s Cricket World Cup Final | India 240 after 50 overs against Australia, in Ahmedabad#ICCWorldCup2023 #IndiaVsAustralia pic.twitter.com/XQU6B8HJ8u
— ANI (@ANI) November 19, 2023