Loading...
Archery: ప్రపంచ యూత్ ఆర్చరీలో భారత్‌కు పసిడి
ప్రపంచ యూత్ ఆర్చరీలో భారత్‌కు పసిడి

Archery: ప్రపంచ యూత్ ఆర్చరీలో భారత్‌కు పసిడి

వ్రాసిన వారు Moogati Shabari
Aug 15, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై భారత యువ క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ వేదికగా జరిగిన 'ప్రపంచ ఆర్చరీ కేఏఏ యూత్ ఇన్విటేషనల్ 2024' టోర్నీలో భారత రికర్వ్ బాలికల జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆగస్టు 10 నుంచి 14 వరకు జరిగిన ఈ టోర్నీలో భారత అమ్మాయిలు అద్భుతమైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచారు. ఫైనల్‌లో భారత జట్టు ఆతిథ్య దక్షిణ కొరియాతో తలపడింది. కొండపావులూరి యుక్తశ్రీ, కృషి కుమావత్, ప్రజల్ తోలియా సభ్యులుగా ఉన్న భారత బృందం ఆరంభం నుంచే సమర్థవంతమైన ప్రదర్శన చేసింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో భారత జట్టు 5-3 తేడాతో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

వివరాలు

జట్టు సభ్యులకు అభినందనలు..

భారత విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యుక్తశ్రీ కీలక పాత్ర పోషించడం విశేషంగా నిలిచింది.

ఆమె ప్రదర్శనతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడాభిమానులు, ఆర్చరీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

భారత జట్టు సాధించిన విజయంపై శాప్ ఛైర్మన్ ఎ. రవినాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షురాలు నందమూరి తేజస్విని, ఛైర్మన్ చెరుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బి.వి. రమణ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ జట్టు సభ్యులను అభినందించారు.

వివరాలు

స్వర్ణ విజయం దేశ యువ ఆర్చర్ల ప్రతిభకు మరో నిదర్శనం..

ప్రస్తుతం భారత సీనియర్ విభాగంలో టాప్-8 ప్రాబబుల్ ఆర్చర్లలో ఒకరిగా కొనసాగుతున్న యుక్తశ్రీ ప్రతిభను వారు ప్రశంసించారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆమె ఎదుగుదలకు తోడ్పడుతున్న తల్లిదండ్రులు, కోచ్‌ల కృషిని కూడా ప్రత్యేకంగా అభినందించారు.

యుక్తశ్రీతో పాటు భారత జట్టు సాధించిన ఈ స్వర్ణ విజయం దేశ యువ ఆర్చర్ల ప్రతిభకు మరో నిదర్శనంగా నిలిచింది.

ADVERTISEMENT