Loading...
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!

WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
03:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 206 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. 165 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ప్రస్తుతం భారత్ 10 టెస్టులు ఆడగా.. ఐదు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రా నమోదు చేసింది. దీంతో 64 పాయింట్లు, 53.33 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ భారత్ స్థానంలో మార్పు రాలేదు. అయితే 53.33 శాతం పాయింట్లతో టాప్-4కు మరింత చేరువైంది.

వివరాలు

77.78 శాతం పాయింట్లతో అగ్రస్థానం..

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 77.78 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

దక్షిణాఫ్రికా 75 శాతంతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 72.22 శాతంతో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ 66.67 శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి.

శ్రీలంక 33.33 శాతం పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 24.36 శాతం, పాకిస్థాన్ 22.22 శాతం, వెస్టిండీస్ 20.83 శాతం పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

శ్రీలంకపై తొలి టెస్టులో గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలోనూ కీలక ప్రయోజనం పొందింది.

టాప్-4లోకి చేరాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయాలు సాధించాల్సి ఉంటుంది.

వివరాలు

284 పరుగులకు ఆలౌట్..

గాలె టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది.

యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 230 బంతుల్లో 167 పరుగులు చేశాడు.

అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా.. ధ్రువ్ జురెల్ 51 పరుగులు, రిషభ్ పంత్ 39 పరుగులు చేశారు.

శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు పడగొట్టగా.. కేశర నువంత మూడు, అసిత ఫెర్నాండో రెండు వికెట్లు తీశారు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినూష శతకం (100)తో మెరిశాడు.

ADVERTISEMENT

వివరాలు

శ్రీలంక ఓటమి..

372 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే కుప్పకూలింది.

కెప్టెన్ ధనంజయ డి సిల్వ 59 పరుగులతో పోరాడాడు. సోనల్ దినూష 84 పరుగులు చేశాడు.

మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు.

మానవ్ సుతార్ రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రవీంద్ర జడేజా, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో సుతార్ 10 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకంగా నిలిచాడు.

ADVERTISEMENT