LOADING...
WTC Points Table : ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాభ‌వం.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా..!
ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాభ‌వం

WTC Points Table : ద‌క్షిణాఫ్రికా చేతిలో ఘోర ప‌రాభ‌వం.. WTC పాయింట్ల పట్టికలో ఐదోస్థానానికి పడిపోయిన టీమిండియా..!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వదేశంలో టీమిండియాకు మరో పెద్ద షాక్ తగిలింది.ద‌క్షిణాఫ్రికా చేతిలో 2-0తేడాతో టెస్టు సిరీస్‌ను భార‌త్ కోల్పోయింది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 408పరుగుల భారీ తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC)2025-27 పాయింట్ల పట్టికలో తన రెండో స్థానాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంది. తాజా సిరీస్‌ను కలుపుకుని,డబ్ల్యూటీసీ 2027సైకిల్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 36 పాయింట్లు నమోదయ్యాయి;వారి విజయ శాతం 75గా ఉంది. భారత్‌పై వరుస ఓటములు రావడంతో, టీమిండియా డబ్ల్యూటీసీ పట్టికలో ఐదో స్థానానికి చేరింది.

వివరాలు 

 పట్టికలో 100 శాతం విజయంతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో

భారత్ ఇప్పటివరకు మొత్తం తొమ్మిది టెస్టులు పూర్తి చేసింది. వీటిలో నాలుగు గెలవగా, నాలుగు మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది. మరొక టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ ఖాతాలో ప్రస్తుతం 52పాయింట్లు ఉండగా,విజయ శాతం 48.15గా కొనసాగుతోంది. అదే సమయంలో,ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ గెలుపొంది 100 శాతం విజయంతో ఆస్ట్రేలియా పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక,ఒకటి గెలిచి ఒకటి డ్రా చేసుకోవడంతో 66.67 విజయ శాతంతో మూడో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ రెండు టెస్టుల్లో ఒకటి గెలిచి,ఒకటిలో ఓడి 50 శాతం విజయంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్,బంగ్లాదేశ్,వెస్టిండీస్ జట్లు వరుసగా ఆరు,ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ సైకిల్‌లో న్యూజిలాండ్ జట్టు ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు.