Page Loader
Sid is vicious: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ సిడ్ విసియస్ కన్నుమూత
డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ సిడ్ విసియస్ కన్నుమూత

Sid is vicious: డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ సిడ్ విసియస్ కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 27, 2024
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత రెజ్లర్ సిడ్ విసియస్(63) కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూశారు. సిడ్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. సిడ్, సైకో సిడ్, సిడ్ జస్టిస్ వంటి పేర్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన సిడ్, డబ్ల్యూడబ్ల్యూఈ, డబ్ల్యూసీడబ్ల్యూలో రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. మృతునికి భార్య సబ్రినా పైజ్, కుమారులు గున్నార్, ఫ్రాంక్ ఉన్నారు.

Details

సంతాపం వ్యక్తం చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ 

సిడ్ మరణ వార్తను అతని కుమారుడు గున్నార్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. "నా తండ్రి సిడ్ యూడీ క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూశారని గున్నార్ తెలిపారు. ఆయనను చాలా మిస్ అవుతామని భావోద్వేగానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో WWE కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, "సిడ్ మరణం వార్తను విని మేము తీవ్రంగా బాధపడుతున్నాము. యూడీ కుటుంబం, స్నేహితులు, అభిమానులకు మా సంతాపాన్ని తెలియజేస్తున్నాము," అని పేర్కొంది.