
yashasvi jaiswal: 95 ఏళ్ల డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలు కొట్టిన యశస్వీ జైస్వాల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇంగ్లాండ్ బౌలర్లపై చెలరేగింది. యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ శతకాలు సాధించి, ఇంగ్లాండ్ బౌలర్లను చితకగొట్టారు. ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ డాన్ బ్రాడ్‌మాన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. యశస్వీ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ లో 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేసి శతకాన్ని పూర్తి చేశాడు.
Details
ఇంగ్లాండ్‌పై అత్యధిక టెస్ట్ సగటుతో ఉన్న బ్యాటర్లు
ఇంగ్లాండ్ జట్టుతో ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్ 90.33 సగటుతో 813 పరుగులు సాధించాడు. దీంతో కనీసం 500 పరుగులకుపైగా ఇంగ్లాండ్‌తో అత్యధిక టెస్ట్ సగటుతో ఉన్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందే డాన్ బ్రాడ్‌మాన్ 63 ఇన్నింగ్స్‌లలో 89.78 సగటుతో 5,028 పరుగులు చేశాడు. యశస్వీ జైస్వాల్: 90.33 డాన్ బ్రాడ్‌మాన్: 89.78 స్టీవీ డెంప్‌స్టర్: 88.42 లారెన్స్ రోవ్: 74.20 జార్జ్ హెడ్లీ: 71.23
Details
జైస్వాల్ కు ఇది రెండోసారి
ఇక ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌లో శతకాన్ని సాధించడం జైస్వాల్‌కు ఇది రెండో సారి. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పెర్త్‌లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 161 పరుగులతో శతకాన్ని నమోదు చేశాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలపై తొలిటెస్ట్ మ్యాచ్‌లలో శతకాలు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్‌లో శతకాలు సాధించిన భారతీయ బ్యాటర్లు మురళీ విజయ్ - 2014 (146 పరుగులు) విజయ్ మంజ్రేకర్ - 1952 (133 పరుగులు) సౌరవ్ గంగూలీ - 1996 (131 పరుగులు) సందీప్ పాటిల్ - 1982 (129 నాటౌట్) యశస్వీ జైస్వాల్ - 2025 (101 పరుగులు