
ఐపీఎల్ లో యశస్వీ జైస్వాల్ సంచలనం.. ఒక్క సెంచరీలతో రికార్డులన్నీ బద్దలు!
ఈ వార్తాకథనం ఏంటి
వాంఖడే స్టేడియంలో జరిగిన 1000వ మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ మెరుపు సెంచరీతో రికార్డులను బద్దలు కొట్టాడు.
ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
రాజస్థాన్ ఆటగాడు యశస్వీ జైస్వాల్ కేవలం 53 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. అంతేకాకుండా 62 బంతుల్లో 8 సిక్సర్లు, 16 ఫోర్లతో 124 పరుగులు చేశాడు.
రాజస్థాన్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరును అతని పేరు మీదనే ఉంది. అంతకుముందు జోస్ బట్లర్ 64 బంతుల్లో 124 పరుగులు చేశాడు. దీంతో జైస్వాల్ బట్లర్ రికార్డును సమం చేశాడు.
Details
మరో రికార్డుకు చేరువలో జైస్వాల్
జైస్వాల్ ఇప్పటివరకు 32 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 975 పరుగులను పూర్తి చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఆరు హఫ్ సెంచరీలను బాదాడు. మరో 25 పరుగులు చేస్తే ఐపీఎల్ లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలవనున్నాడు.
ఇక ముంబై ఇండియన్స్ ఫై సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా జైస్వాల్ రికార్డు సాధించడం విశేషం. అలాగే రాజస్థాన్ తరుపున సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా అతను చరిత్ర సృష్టించాడు.
ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడి 428 పరుగులు చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.