యశస్వీ జైస్వాల్ సూపర్ సెంచరీ.. ముంబై ముందు భారీ స్కోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023 సీజన్ లో మూడో సెంచరీ నమోదైంది. భీకర ఫామ్ లో ఉన్న యశస్వీ జైస్వాల్ ముంబై ఇండియన్స్ పై సెంచరీతో చెలరేగాడు.
వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆ జట్టుకు జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 72 పరుగులు జోడించారు. అనంతరం బట్లర్(18) చావ్లా బౌలింగ్ లో ఔటయ్యాడు.
కామెరూన్ గ్రీన్ వేసిన మొదటి ఓవర్లో సిక్సర్ తో ఖాతా తెరిచిన జైస్వాల్.. చివర వరకు క్రీజులోకి ఉండి రాజస్థాన్ కు భారీ స్కోరును అందించారు. 62 బంతుల్లో 124 పరుగులు చేసి ముంబై బౌలర్లకు జైస్వాల్ చుక్కలు చూపించాడు.
Details
విజృంభించిన రాజస్థాన్ బ్యాటర్లు
సంజుశాంసన్(12), ఫడిక్కల్(2), హోల్డర్(11), హిట్మేయర్(8), రవిచంద్రన్ అశ్విన్(8) పరుగులు చేశారు.దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
ముంబై బౌలర్లలో అర్షద్ ఖాన్ 3, పీయూష్ చావ్లా 2, మెరిడిత్, అర్చర్ తలా ఓ వికెట్ తో రాణించారు
ఇది ఐపీఎల్లో 1000వ మ్యాచ్ కావడం విశేషం. మరోవైపు రోహిత్ శర్మ పుట్టిన రోజుతో పాటు.. అతనికి ఇది 150వ మ్యాచ్ కావడం గమనార్హం.