విజృంభించిన గుజరాత్ బౌలర్లు; ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తన ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసుకుంది.
అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్రమోడీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయిఇండియన్స్‌పై 55 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలిచింది.
తొలుత భ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది. ముంబయిఇండియన్స్ జట్టుకు 208పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు నిర్దేశించింది.
అయితే లక్ష్యాన్ని చేధించడంలో ముంబయి ఇండియన్స్ చతికిల పడింది.
20ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేసి రోహిత్ సేన మరో ఓటమిని చవిచూసింది.
క్రికెట్
మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచిన నూర్ అహ్మద్
గుజరాత్ బౌలర్ నూర్ అహ్మద్ మూడు వికెట్లతో ముంబయి ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ నడ్డి విరిచాడు.
రషీద్ ఖాన్, మోహి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన నూర్ మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చినప్పటికీ, అతను డెంజరస్ కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్‌ను పెవిలియన్‌కు పంపండంలో విజయవంతమయ్యాడు.
ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు 26.00 బ్యాటింగ్ సగటుతో ఓటమి పాలైంది. ఐపీఎల్‌లోనే ఇది మూడో అత్యల్ప సగటు కావడం గమనార్హం. ఈ జాబితాలో ఆర్సీబీ 57.00 సగటుతో అగ్రస్థానంలో ఉంది.