LOADING...
Smriti Mandhana: మొన్న పెళ్లి రద్దు.. నేడు మహిళల క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
మొన్న పెళ్లి రద్దు.. నేడు మహిళల క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

Smriti Mandhana: మొన్న పెళ్లి రద్దు.. నేడు మహిళల క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. ఆమె మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 10,000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో, వ్యక్తిగత స్కోరు 27 ప‌రుగు వద్ద స్మృతి ఈ ఘనతను సాధించింది. ఈ క్రమంలో ఆమె టీమిండియా దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్‌ను అధిగమించింది. మిథాలీ రాజ్ 10,000 ప‌రుగుల మైలురాయిని 291 ఇన్నింగ్స్‌ల్లో చేరగా, మంధాన 281 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకున్నారు.

Details

నాలుగో ప్లేయర్ గా రికార్డు

ఇలా స్మృతి మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో ప్లేయర్‌గా రికార్డులలో సమం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మంధాన 48 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 ప‌రుగులు సాధించింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 221 ప‌రుగులు సాధించింది. భారత్ బ్యాటర్లలో స్మృతి మంధాన 80 (48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు), షెఫాలీ వర్మ: 79 (46 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్), రిచా ఘోష్: 40 (16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు బాదారు,

Details

మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 ప‌రుగులు చేసిన ప్లేయర్లు

మిథాలీ రాజ్ (భారత్): 10,868 ప‌రుగులు సూజీ బేట్స్ (న్యూజిలాండ్): 10,652 ప‌రుగులు చార్లోట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్): 10,273 ప‌రుగులు స్మృతి మంధాన (భారత్): 10,053 ప‌రుగులు స్మృతి మంధాన ఈ ఘనతతో భారత మహిళా క్రికెట్‌లో సరికొత్త రికార్డుల జాబితాలో చోటు చేసుకున్నారు.

Advertisement