PM Modi: 'జట్టు కోసం ఎప్పుడూ ముందుంటావు'.. అశ్విన్‌పై మోదీ ప్రశంసలు
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెట్‌కు అతడు అందించిన అపారమైన సేవలకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లేఖ రాసి అశ్విన్‌ను అభినందించారు. మీ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఎన్నో ఆఫ్ బ్రేక్స్, క్యారమ్ బంతులతో ప్రత్యర్థులను కదిలించిన మీరు, ఇప్పుడు ఈ నిర్ణయం కూడా క్యారమ్ బంతులా మలుపు తీసుకుంది.
జెర్సీ నంబర్ 99 మిస్ అవుతాం
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా కఠినమైన పని అని అందరికి తెలుసన్నారు. భారత్ కోసం ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలిచ్చారన్నారు. అశ్విన్ అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా జట్టు కోసం ఆయన ఆలోచించారని, కానీ చెన్నై వరదల సమయంలో సాయం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇకపై జెర్సీ నంబర్ 99 తాము మిస్ అవుతున్నామని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.