LOADING...
Prithvi Shaw: 'నువ్వు మారవా బ్రో!'.. మరో వివాదంలో పృథ్వీ షా (వీడియో) 
'నువ్వు మారవా బ్రో!'.. మరో వివాదంలో పృథ్వీ షా (వీడియో)

Prithvi Shaw: 'నువ్వు మారవా బ్రో!'.. మరో వివాదంలో పృథ్వీ షా (వీడియో) 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 08, 2025
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాకు దూరంగా ఉన్న బ్యాటర్ 'పృథ్వీ షా' ఇప్పుడు మళ్లీ క్రీడా ప్రపంచంలో గుర్తింపు సంపాదిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఫిట్‌నెస్, ఫామ్ సమస్యలతో అతడిపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. టీమిండియా నుంచి బయటపడిన తర్వాత పలు వివాదాల్లోనూ తలదూర్చిన పృథ్వీ, దేశవాళీ క్రికెట్‌లో కొత్త అధ్యాయం ప్రారంభించాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు ముందుగా మాజీ జట్టు ముంబైతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో మహారాష్ట్ర తరఫున ఆడిన పృథ్వీ షా అద్భుతమైన ప్రదర్శనతో సెంచరీ సాధించాడు.

Details

140 బంతుల్లో 181 పరుగులు

కేవలం 140 బంతుల్లో 181 పరుగులు, మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణ్‌తో కలిసి తొలి వికెట్‌కు 305 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీతో తన ప్రతిభను చూపించినా, పృథ్వీ షా ఒక వివాదంలో చిక్కుకున్నాడు. ముంబై ఆటగాడు ముషీర్ ఖాన్‌ ఔట్ చేసిన తరువాత ఆగ్రహంతో బ్యాటుతో దాడికి యత్నించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లలో ఆగ్రహం రేకెత్తింది. మైదానంలో కొద్దిసేపటి గందరగోళం నెలకొంది. దీంతో అంపైర్లు జోక్యం చేసుకుని పృథ్వీ షాను దూరంగా పంపడంతో గొడవ సద్దుమణిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో