Page Loader
ENG vs IND : వామ్మో గిల్‌.. 23 ఏళ్ల ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెప్టెన్
వామ్మో గిల్‌.. 23 ఏళ్ల ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెప్టెన్

ENG vs IND : వామ్మో గిల్‌.. 23 ఏళ్ల ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేసిన యువ కెప్టెన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ గడ్డపై భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డులు తిరగరాస్తున్నాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ విఫలమైనా, ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 9 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 6 పరుగులు చేసిన గిల్ బ్రైడాన్ కార్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవతలై పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తోనే ఆయన అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత 2002లో 602 పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్ పేరిలో ఉండేది. తాజా సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు 607 పరుగులు చేసి ద్రవిడ్‌ను అధిగమించాడు.

Details

ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు

మూడో స్థానంలో 2018లో 593 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ - 607 పరుగులు (2025) రాహుల్ ద్రవిడ్ - 602 పరుగులు (2002) విరాట్ కోహ్లీ - 593 పరుగులు (2018) సునీల్ గవాస్కర్ - 542 పరుగులు (1979) రాహుల్ ద్రవిడ్ - 461 పరుగులు (2011)

Details

ఇంగ్లండ్ గెలుపునకు 6 వికెట్లు అవసరం

ఇదిలా ఉంటే, లార్డ్స్ టెస్టులో ఇరు జట్లు సమంగా పోటీపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. భారత కూడా 387 పరుగులే చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు విజయానికి 193 పరుగుల లక్ష్యం ఏర్పడింది. ఛేదనలో భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (33) నిలకడగా ఆడుతుండగా, భారత్ విజయానికి చివరి రోజు ఇంకా 135 పరుగులు అవసరం. మరోవైపు ఇంగ్లాండ్ గెలవాలంటే మిగిలిన 6వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో టెస్టు చివరి రోజు ఉత్కంఠతతో కూడిన పోరు నెలకొననుంది.