Yashasvi Jaiswal: ముంబై జట్టులో యువ ఓపెనర్ జైస్వాల్ రీఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దేశవాలీ క్రికెట్‌లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకతో జరగనున్న రంజీ ట్రోఫీ 2025-26 క్వార్టర్‌ఫైనల్ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం కలిగింది. ఈ సీజన్‌లో జైస్వాల్ ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ బాధ్యతలు లేకపోయినా, కొద్ది రోజుల వరకు అతను ముంబై జట్టులో ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అతనికి జట్టులో చోటు లభించడంతో ఊహాగానాలకు ముగింపు దొరికింది. తాజాగా ప్రకటించిన జట్టులో జైస్వాల్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌కు కూడా అవకాశం లభించింది.
Details
ముంబై క్వార్టర్‌ఫైనల్ 16 మంది సభ్యుల జట్టు
గాయాల కారణంగా శార్దూల్ గత కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు, కానీ ముంబై జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రహానే జట్టులో లేని కారణంగా శార్దూల్‌కు ఈ క్వార్టర్‌ఫైనల్‌లో కెప్టెన్సీ లభించింది. యశస్వీ జైస్వాల్, శార్దూల్ ఠాకూర్ చేరికతో ముంబై జట్టు మరింత పటిష్టంగా మారింది. శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ముషీర్ ఖాన్, అఖిల్ హెర్వడ్కర్ సిద్ధేశ్ లాడ్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ ఆనంద్ (wk), హార్దిక్ తమోరే (wk), సైరాజ్ పటిల్, శంస్ ములానీ తనుష్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్థ ఓంకార్ తర్మలే, దివ్యేష్ సక్సేనా, సూర్యాంశ్ షెడ్గే