LOADING...
MS Dhoni - Irfan Pathan: ధోనీ-ఇర్ఫాన్ స్నేహంపై కట్టుకథలు.. నిజం లేదన్న యుద్ధజీత్ దత్తా
ధోనీ-ఇర్ఫాన్ స్నేహంపై కట్టుకథలు.. నిజం లేదన్న యుద్ధజీత్ దత్తా

MS Dhoni - Irfan Pathan: ధోనీ-ఇర్ఫాన్ స్నేహంపై కట్టుకథలు.. నిజం లేదన్న యుద్ధజీత్ దత్తా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై పరోక్షంగా 'హుక్కా' వ్యాఖ్యలు చేసిన ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. ధోనీ, విరాట్ కోహ్లీపై తరచూ వ్యాఖ్యలు చేసే యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్‌కు ఇప్పుడు ఇర్ఫాన్ కూడా తోడయ్యాడంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే ఇర్ఫాన్-ధోనీ సంబంధాలపై మరో కోణం వెలుగులోకి వచ్చింది. ధోనీకి ఒకప్పుడు మేనేజర్‌గా పనిచేసిన యుద్ధజీత్ దత్తా సోషల్ మీడియాలో స్పందించారు. ఇర్ఫాన్ పఠాన్‌, ఎంఎస్ ధోనీ స్నేహాన్ని నేను ప్రత్యక్షంగా చూశా. అది నాకు దక్కిన అదృష్టం. కొన్నేళ్ల క్రితం ధోనీతో పాటు ఇతర క్రికెటర్ల యాడ్స్‌కు నేను పనిచేశాను.

Details

నిజం కంటే కట్టుకథలే త్వరగా వైరల్ అవుతాయి

పెప్సీ షూటింగ్ సమయంలో ఇర్ఫాన్‌, ధోనీతో కలిసి నేను ఒకే వ్యాన్‌లో తిరిగాను. ఆ రోజులు మరువలేనివి. షూట్ పూర్తయ్యాక వారిద్దరూ నాకు సంతకాలు చేసిన బ్యాట్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ బ్యాట్లపై ఆటోగ్రాఫ్ మాత్రమే కాకుండా, తమ స్నేహం గురించి కూడా కొన్ని లైన్లు రాశారు. 'మన మధ్య అనుబంధానికి ఇది గుర్తుగా ఉంచుకో' అని అన్నారు. ఇప్పటికీ ఆ బ్యాట్లు నా వద్ద ఉన్నాయని దత్తా గుర్తుచేసుకున్నారు. అలాగే, ప్రస్తుతం ఇర్ఫాన్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పష్టం చేశారు. నిజం కంటే కట్టుకథలే త్వరగా వైరల్ అవుతాయి. అందుకే ఇవాళ జరుగుతున్న ప్రచారం చూస్తే, నాకు ఆ మధుర స్మృతులు గుర్తొచ్చాయని అన్నారు.