Yuvraj Singh: ఐపీఎల్‌లోకి యువరాజ్ సింగ్.. ఆ జట్టు హెడ్ కోచ్‌గా కొత్త జర్నీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్‌జెయింట్స్ తమ కోచింగ్ స్టాఫ్‌లో విస్తృత మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మెంటార్‌గా ఉన్న జహీర్ ఖాన్‌ను తప్పించిన లక్నో, ఇప్పుడు ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్‌ను కూడా తొలగించే ఆలోచనలో ఉందని సమాచారం. ఆండీ ఫ్లవర్ తర్వాత లక్నోకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన లాంగర్ టీమిండియా ఆటగాళ్లతో సరైన అనుబంధం కొనసాగించలేకపోయారని ఫ్రాంచైజీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకోవాలని లక్నో సూపర్ జెయింట్స్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. యువరాజ్‌తో ఫ్రాంచైజీ ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Details
యువరాజ్ శిష్యులుగా అభిషేక్ శర్మ, ప్రియాన్ ఆర్య
ఇప్పటి వరకు యువరాజ్ ఎలాంటి ప్రొఫెషనల్ జట్టుకు హెడ్ కోచ్‌గా పని చేయకపోయినా, అబుదాబి టీ10 లీగ్‌లో మెంటార్‌గా కొనసాగుతున్నారు. అంతేకాక, పంజాబ్‌కు చెందిన అనేకమంది యువ ఆటగాళ్లను తన అనుభవంతో తీర్చిదిద్దినట్లు చెప్పబడుతోంది. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రియాన్ష్ ఆర్య వంటి ఆటగాళ్లు యువరాజ్ శిష్యులుగా పేరుపొందారు. ఒకవేళ యువరాజ్ సింగ్ నిజంగానే లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తే, జట్టు తలరాత మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇటీవల లక్నో ఫ్రాంచైజీ పలు కొత్త నియామకాలు కూడా చేసింది.
Details
స్పిన్ విభాగానికి బౌలింగ్ కోచ్ గా కార్ల్ క్రోవ్
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను వ్యూహాత్మక సలహాదారుగా నియమించగా, భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా, స్పిన్ విభాగానికి కార్ల్ క్రోవ్‌ను స్పిన్ బౌలింగ్ కోచ్‌గా తీసుకున్నారు. గత సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ నాయకత్వంలో ప్లే ఆఫ్స్ దశకు చేరుకోలేకపోయిన నేపథ్యంలో ఈ మార్పులతో జట్టు ప్రదర్శనను మెరుగుపర్చాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.