NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్!

    Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2025
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్యాపై ఉక్రెయిన్ చేసిన అత్యంత సమన్విత డ్రోన్ దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దాదాపు మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఈ రకమైన దాడి తొలిసారి చోటుచేసుకుంది.

    రష్యాలోని వ్యూహాత్మక స్థాయిలో ఉన్న సుదూర వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. ముఖ్యంగా అణు సామర్థ్యం కలిగిన బాంబర్లే ప్రధానంగా లక్ష్యంగా నిలిచాయి.

    ఈ దాడిలో 40కి పైగా రష్యన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దాదాపుగా 7 బిలియన్ డాలర్ల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. మాస్కో కూడా ఈ దాడిని ధ్రువీకరించింది.

    విశేషంగా టర్కీలో శాంతి చర్చలు మొదలయ్యే రోజే ఈ దాడి జరగడం గమనార్హం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని "అద్భుతమైన ఆపరేషన్"గా అభివర్ణించారు...

    Details

    117 డ్రోన్లు - 18 నెలల ప్రణాళిక 

    ఈ దాడి వెనుక చాలా రోజుల ప్లానింగ్ ఉంది. 'ఆపరేషన్ స్పైడర్ వెబ్' పేరుతో నిర్వహించిన ఈ మిషన్‌కు 18 నెలల సమయం పట్టింది.

    మొత్తం 117 డ్రోన్లు ఉపయోగించి ఉక్రెయిన్ పై ఈ దాడిని అమలు చేసింది. జెలెన్స్కీ స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు.

    ఈ ఆపరేషన్‌ను 'రష్యా నిఘా సంస్థ ఎఫ్‌ఎస్‌బీ' కార్యాలయం పక్కననున్న ఒక కార్యాలయం నుంచే సమన్వయించారు.

    ఈ దాడిలో రష్యా వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకల్లో 34 శాతం ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ పేర్కొంది.

    దాడి సమయంలో ట్రక్కుల్లో చెక్కకట్టల కింద డ్రోన్లను రవాణా చేసి, అవసరమైనప్పుడు రిమోట్ కంట్రోల్ సాయంతో పైకప్పును తెరిచి విమాన స్థావరాలపై దాడి చేశారు.

    Details

     దాదాపు 4,300 కిలోమీటర్ల లోపలే దాడి! 

    ఈ ఆపరేషన్‌లో ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్, అముర్ ప్రాంతాల్లోని ఐదు ముఖ్యమైన ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా మారాయి.

    ముఖ్యంగా బెలాయా ఎయిర్‌బేస్ (ఇర్కుట్స్క్ ఓబ్లాస్ట్).. ఉక్రెయిన్ సరిహద్దు నుండి సుమారు 4,300 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఒలెన్యా ఎయిర్‌బేస్ (ముర్మాన్స్క్ ఓబ్లాస్ట్) - ఫ్రంట్‌లైన్ ప్రాంతాల నుంచి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఈ స్థావరాలపై దాడులు జరగడం ఉక్రెయిన్ టెక్నికల్ శక్తిని ప్రదర్శించడమే కాదు, రష్యా రక్షణ వ్యవస్థలపై కూడా కీలక ప్రశ్నలు లేవనెత్తుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉక్రెయిన్
    రష్యా

    తాజా

    Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్! ఉక్రెయిన్
    Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్‌ ఎన్నికలు..? బిహార్
    Piyush Goyal: వాణిజ్య ఒప్పందంపై భారత్, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి: పీయూష్ గోయెల్‌ పీయూష్ గోయెల్‌
    IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఉక్రెయిన్

    Russia:ఉక్రెయిన్‌తో పోరాడేందుకు రష్యా మాస్కో నివాసితులకు రికార్డు స్థాయిలో $22,000 అందిస్తోంది  రష్యా
    Ukraine war briefing: ఉక్రెయిన్ సహాయంలో $2 బిలియన్ల అకౌంటింగ్ లోపాన్ని గుర్తించిన పెంటగాన్  అమెరికా
    Narendra Modi : రష్యా పర్యటన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ రష్యా
    PM Modi Ukraine Visit: 2022 రష్యా దాడి తర్వాత తొలిసారిగా మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు  నరేంద్ర మోదీ

    రష్యా

    Russia: ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌పై రష్యా క్షిపణి దాడులు ఉక్రెయిన్
    NATO: ఆహారం, ఔషధాలు నిల్వ చేయండి.. యుద్ధ భయాల నడుమ నాటో దేశాలు హెచ్చరిక ఉక్రెయిన్
    Baltic Sea: బాల్టిక్‌ సముద్రంలో ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం.. రష్యాపై అనుమానాలు! స్వీడన్
    Nuclear War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం:.. అమెరికా క్షిపణి అనుమతితో అణు యుద్ధ ముప్పు ఉక్రెయిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025