LOADING...
Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ.. వారానికే చనిపోయిన బాలిక
14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ.. వారానికే చనిపోయిన బాలిక

Mexico: 14ఏళ్ల బాలికకు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ.. వారానికే చనిపోయిన బాలిక

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికోలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 14ఏళ్ల చిన్నారికి బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆ ఆపరేషన్ జరిగి వారం గడిచేలోపే ఆమె ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఈ విషయం తండ్రి కార్లోస్ అరెల్లానో సోషల్ మీడియాలో పంచుకోవడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, పాలోమా నికోల్ అరెల్లానో ఎస్కోబెడో అనే బాలిక మెక్సికోలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీ చేయించుకుంది. కానీ ఆ శస్త్రచికిత్స తర్వాత కేవలం వారంలోనే ఆమె మరణించిందని తండ్రి కన్నీటి పర్యంతమై వెల్లడించారు. తల్లి నిర్లక్ష్యం, ఆమె రెండో భర్త ఒత్తిడి కారణంగానే ఈ సర్జరీ జరిగిందని, ఆ ప్రక్రియలో ఇంప్లాంట్లు ఉపయోగించారని తండ్రి ఆరోపించారు.

వివరాలు 

తండ్రికి తెలియకుండా శస్త్రచికిత్స

పర్ఫెక్ట్ ఫిజిక్ కనిపించాలన్న కోరికతో చిన్న వయసులోనే యువతులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనడానికి ఈ ఘటననే నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌ టాక్ వంటి సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పాలోమా, తండ్రికి తెలియకుండా ఈ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. మొదటగా విడుదలైన మరణ ధృవపత్రంలో బాలిక ఓ వ్యాధి కారణంగా చనిపోయిందని పేర్కొన్నారు. అయితే వాస్తవానికి మెదడు వాపు రావడం, మెదడుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోవడం వల్ల ఆమె మృతిచెందిందని తేల్చారు. ఈ సమస్యలన్నీ ఆ సర్జరీ వల్లే వచ్చాయని, అయినా ఈ విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరిగిందని తండ్రి ఆరోపించారు.

వివరాలు 

కేసుపై అధికారికంగా విచారణ

దీనిపై ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. క్లినిక్, వైద్యులు, తల్లి, ఆమె రెండో భర్త ఈ ఘటనను కవర్‌అప్ చేయడానికి ప్రయత్నించారని, అందువల్ల వీరందరూ బాధ్యత వహించాలన్నారు. పూర్తి నిజం వెలుగులోకి రావాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసుపై అధికారికంగా విచారణ జరుగుతోందని మెక్సికన్ అధికారులు ప్రకటించారు.