Page Loader
UK: యూకే వీసాల్లో డిజిటల్‌ విప్లవం.. జులై 15 నుంచి ఈ-వీసా విధానం అమలు!
యూకే వీసాల్లో డిజిటల్‌ విప్లవం.. జులై 15 నుంచి ఈ-వీసా విధానం అమలు!

UK: యూకే వీసాల్లో డిజిటల్‌ విప్లవం.. జులై 15 నుంచి ఈ-వీసా విధానం అమలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇమిగ్రేషన్‌ వ్యవస్థను మరింత సాంకేతికంగా మార్చే దిశగా యునైటెడ్ కింగ్‌డమ్‌ (UK) కీలక ముందడుగు వేసింది. జూలై 15, 2024 నుంచి సాధారణ వీసాలను రద్దు చేసి వాటి స్థానంలో ఈ-వీసా (e-Visa) వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనుంది. అన్ని రకాల వీసాలకూ ఇది వర్తించనుండగా, బ్రిటన్‌లో విద్యాభ్యాసం చేసే భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం మరింత స్పష్టంగా పడనుంది.

Details

డిజిటల్ వీసాలు.. ఇకపైన పాస్‌పోర్టుపై స్టాంపు లేదు!

ఇకపై జారీ అయ్యే వీసాలు దరఖాస్తుదారుల పాస్‌పోర్టులతో డిజిటల్‌గా లింక్‌ అవుతాయి. పాస్‌పోర్టు మీద వీసా స్టికర్ లేదా విగ్నెట్ ఇవ్వడాన్ని యూకే ప్రభుత్వం నిలిపివేస్తోంది. ఈ కొత్త విధానంలో ఈ-వీసా ద్వారా వ్యక్తి ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ను డిజిటల్‌ పద్ధతిలో గుర్తించవచ్చు. వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా ఉండాలి ఈవీసా పొందిన విద్యార్థుల పాస్‌పోర్టు సమాచారం, వ్యక్తిగత డేటా తప్పకుండా అప్‌డేట్‌ అయి ఉండాలి. పాస్‌పోర్టును రీన్యూ చేసినా లేదా మరేదైనా మార్పులు జరిగితే, ప్రయాణానికి ముందు యూకేవీఐ (UKVI) ఖాతాలో అప్డేట్‌ చేయడం తప్పనిసరి.

Details

 UKVI ఖాతా తప్పనిసరి

ఈవీసాను పొందిన తర్వాత విద్యార్థులు UKVI ఖాతా తప్పనిసరిగా క్రియేట్‌ చేసుకోవాలి. ఈ ఖాతా ద్వారానే వీసా సమాచారం, ఇమిగ్రేషన్‌ స్టేటస్, ఇతర వివరాలను విశ్వవిద్యాలయాలు, కంపెనీలు, ల్యాండ్‌లార్డ్స్‌ చెక్‌ చేయగలుగుతారు. అందుకే లాగిన్‌ క్రెడెన్షియల్స్‌, కాంటాక్ట్ డిటైల్స్‌ను విద్యార్థులు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి.

Details

UK ప్రయాణానికి ముందు చేయాల్సిన అవసరాలు

ఈ-వీసా జారీ అయ్యిందో లేదో ధృవీకరించుకోవాలి. పాస్‌పోర్టు వివరాలు ఈవీసాతో లింకై ఉన్నాయో లేదో పరిశీలించాలి. UKVI ఖాతా నమోదు చేసుకోవాలి వీసా డెసిషన్ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సేవ్‌ చేయాలి లేదా ప్రింట్‌ తీసుకోవాలి. వీసా అప్లికేషన్‌లో ఉపయోగించిన పాస్‌పోర్టును తీసుకెళ్లాలి. యూనివర్శిటీ అకామిడేషన్ సంబంధిత పాలసీలను చెక్‌ చేసి, ఇమిగ్రేషన్ వెరిఫికేషన్‌కు సిద్ధంగా ఉండాలి.

Details

 బోర్డర్‌ చెక్‌ ఎలా జరుగుతుంది?

ప్రయాణ సమయంలో విద్యార్థులు తమ పాస్‌పోర్టును అధికారులకు చూపాలి. వారు స్కాన్‌ చేసినప్పుడు, ఆన్‌లైన్‌లో లింకైన ఈవీసా డేటా బేస్‌ నుంచి చూసి మంజూరు అయిన వీసాను ధృవీకరిస్తారు. అందువల్ల, డిజిటల్ వీసా కాపీతోపాటు పాస్‌పోర్టు కూడా విద్యార్థుల వద్ద ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా యూకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈవీసా విధానం సమర్థవంతమైన, డిజిటల్‌ మైగ్రేషన్‌ను గమనించగల కొత్త దశగా భావిస్తున్నారు. భారతీయ విద్యార్థులు తమ ప్రయాణానికి ముందు అన్ని అంశాలపై స్పష్టత సాదించుకొని, అవసరమైన అప్‌డేట్లను పూర్తి చేసుకోవడం ఎంతో అవసరం.