LOADING...
Turkey: టర్కీ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు.. 16 మందికి గాయాలు
టర్కీ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు.. 16 మందికి గాయాలు

Turkey: టర్కీ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు.. 16 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 14, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

టర్కీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. దక్షిణ-తూర్పు టర్కీలోని సాన్లియుర్ఫా ప్రావిన్స్, సివెరెక్ జిల్లాలో ఉన్న Koyuncu Vocational and Technical Anatolian High Schoolలో మంగళవారం ఒక మాజీ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో కనీసం 16 మంది గాయపడ్డారు. 18 ఏళ్ల దుండగుడు షాట్‌గన్‌తో స్కూల్ ప్రాంగణంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అదే ఆయుధంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో 10 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, ఒక కాంటీన్ ఉద్యోగి, ఒక పోలీస్ గాయపడ్డారు.

వివరాలు 

దుండగుడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు: గవర్నర్

గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు మార్చారు. దుండగుడికి ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని స్థానిక గవర్నర్ హసన్ సిల్డాక్ తెలిపారు. పోలీసులు అతడిని భవనం లోపల చుట్టుముట్టగా, చివరికి తానే తనను కాల్చుకుని మృతి చెందినట్లు చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. కాల్పులు ప్రారంభమైన సమయంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక విద్యార్థి కిటికీ ద్వారా తప్పించుకున్నట్లు వెల్లడించాడు. ఈ దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Advertisement