LOADING...
Istanbul: ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు.. ఇద్దరు దుండగులు మృతి
ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు.. ఇద్దరు దుండగులు మృతి

Istanbul: ఇస్తాంబుల్‌లో ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు.. ఇద్దరు దుండగులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో ఉన్న ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం బయట మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు మృతి చెందగా,మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల సమయంలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు.వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం,దుండగులు లాంగ్ బ్యారెల్ ఆయుధాలతో కాన్సులేట్ సమీపంలో కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు దుండగులు అక్కడికక్కడే మృతి చెందారు. మూడో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు మూసివేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు టర్కీ న్యాయ మంత్రి ఆకిన్ గుర్లెక్ వెల్లడించారు.అయితే దుండగుల వివరాలు,దాడి వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టర్కీలో కలకలం.. ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు

Advertisement