Page Loader
Iran-Israel War: టెహ్రాన్‌ మీదకు 20 యుద్ధ విమానాలు.. ఇజ్రాయెల్‌ ఘోర వైమానిక దాడి
టెహ్రాన్‌ మీదకు 20 యుద్ధ విమానాలు.. ఇజ్రాయెల్‌ ఘోర వైమానిక దాడి

Iran-Israel War: టెహ్రాన్‌ మీదకు 20 యుద్ధ విమానాలు.. ఇజ్రాయెల్‌ ఘోర వైమానిక దాడి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, టెల్‌ అవీవ్‌ తాజాగా టెహ్రాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది. సుమారు 20 ఫైటర్‌ జెట్లతో జరిపిన ఈ దాడుల్లో 30కి పైగా బాంబులను ప్రయోగించినట్లు టెల్‌ అవీవ్‌ రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించింది. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని నిల్వ చేసిన క్షిపణులను ధ్వంసం చేయడమే ఈ దాడుల ప్రధాన ఉద్దేశమని, ఇది తమ రక్షణకోసమే జరిపిన చర్యని ఇజ్రాయెల్‌ పేర్కొంది. తాజా దాడుల్లో టెహ్రాన్‌లోని కీలక మిస్సైల్‌ లాంచర్‌ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, కెర్మాన్షా, హమెదాన్‌ ప్రాంతాల్లోని మిలిటరీ రాడార్‌ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్‌ తీవ్రంగా విరుచుకుపడింది.

Details

యుద్ధాన్ని వెంటనే ఆపాలి

భవిష్యత్తులో ఈ మిస్సైల్‌ కేంద్రాలు తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవడానికే ఉపయోగపడతాయని ఇజ్రాయెల్‌ ఆరోపించింది. కొన్ని రోజులుగా ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ సమాజం ఈ దాడులను మితిమీరిన చర్యలుగా ఖండిస్తోంది. మిడిల్‌ ఈస్ట్‌ లో శాంతిని నెలకొల్పాలని, యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఐక్యరాజ్యసమితితో పాటు అనేక దేశాలు ఇజ్రాయెల్‌, ఇరాన్‌లను కోరుతున్నాయి. మరోవైపు, ఇరాన్‌ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులకు దిగకపోయినా, తాజా దాడులతో పరిస్థితులు మరింత సంక్లిష్టతరం అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.