
explosion: యెమెన్ తీరంలో MP ఫాల్కన్ ట్యాంకర్‌లో అగ్నిప్రమాదం.. 23 మందిని కాపాడిన ఈయూ నేవల్ ఫోర్స్
ఈ వార్తాకథనం ఏంటి
సముద్ర తీరంలో ఎల్‌పీజీ సరఫరా చేస్తున్న ఓడలో తీవ్రమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈఘటనలో 23 మంది భారతీయ నౌకాదళ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, హూతీ దాడి కారణంగా పేలుడు జరిగిందని ప్రచారం జరుగుతున్న సమయంలో, అధికారులు ఈ వార్తలను ఖండిస్తూ పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 18న,ఒమన్ నుంచి కామెరూన్‌లోని జిబౌటి వైపు బయలుదేరిన ఎంపీ ఫాల్కన్ అనే ఓడ, అడెన్ తీరానికి చేరగానే,లోపల ఉన్న ఎల్‌పీజీ కారణంగా ఒక్కసారిగా మంటలు విస్తరించాయి. ఈఘటనను గమనించిన యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ ఆపరేషన్ ఆస్పైడ్స్ దక్షిణ పక్షంలో అప్రమత్తమై,సహాయక చర్యలు చేపట్టి 23 మంది భారతీయ సిబ్బందిని రక్షించారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు గల్లంతు కాగా,ఇంకో వ్యక్తి మంటల్లో చిక్కుకుపోయారు.
వివరాలు
పేలుళ్లు జరిగే అవకాశం.. ఓడలన్నీ దూరంగా వెళ్లాలని ఆస్పైడ్స్ సూచన
ట్యాంకర్‌లో గ్యాస్ నిండి ఉండడం కారణంగా, మరిన్ని పేలుళ్లకు అవకాశం ఉన్నందున, సమీపంలో ఉన్న అన్ని నౌకలను దూరంగా ఉండమని ఆస్పైడ్స్ సూచించింది. మంటలు ఇంకా పెరుగుతున్న కారణంగా, ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికను కూడా ఇచ్చారు. ఇప్పటికే గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోందని, మధ్య పాలస్తీనియన్ల వాణిజ్య నౌకలు ఎర్ర సముద్రం కారిడార్ ద్వారా ప్రయాణిస్తున్న నేపథ్యంలో, యెమెన్ హూతీ తిరుగుబాటుదారులు ఈ నౌకలను లక్ష్యంగా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో తమకు ఏ సంబంధం లేదని హూతీ నేతలు స్పష్టం చేశారు.