Page Loader
Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి 
అమెరికాలోని పెన్సిల్వేనియాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి

Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి 

వ్రాసిన వారు Stalin
Mar 24, 2024
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో అర్షియా జోషి(24) అనే భారతీయ వృత్తినిపుణులు మృతి చెందారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ "ఆమె మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తరలించడానికి సాధ్యమైన అన్ని సహాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు"తెలిపింది. మార్చి 21న పెన్సిల్వేనియాలో జరిగిన ఒక విషాద కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ప్రొఫెషనల్ అర్షియా జోషి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్‌ చేసింది. "ఆమె భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తాం"అని ట్వీట్‌లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్,వాషింగ్టన్ డిసిలోని భారత రాయబార కార్యాలయలను ట్యాగ్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్‌