Loading...
Ukraine: పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. పన్నుల ఆదాయంతో డ్రోన్లు కొనాలని ఉక్రెయిన్‌ ప్లాన్
పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. పన్నుల ఆదాయంతో డ్రోన్లు కొనాలని ఉక్రెయిన్‌ ప్లాన్

Ukraine: పోర్నోగ్రఫీకి చట్టబద్ధత.. పన్నుల ఆదాయంతో డ్రోన్లు కొనాలని ఉక్రెయిన్‌ ప్లాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం (Ukraine-Russia War) నాలుగేళ్లకు పైగా సాగుతోంది. ఇరు దేశాల మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. యుద్ధంలో ఎవరిది పైచేయి, ఎవరిది ఓటమి అనే స్పష్టత లేకపోయినా.. రెండు దేశాలు తమ సైనిక చర్యలను కొనసాగిస్తున్నాయి. రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆర్థిక, సైనిక సహాయం కోరుతున్న ఉక్రెయిన్‌.. ఇప్పుడు యుద్ధానికి అవసరమైన నిధులను సొంతంగా సమకూర్చుకునే మార్గాలపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పోర్నోగ్రఫీని చట్టబద్ధం చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

వివరాలు 

ఏటా సుమారు 25 మిలియన్‌ డాలర్ల ఆదాయం

పోర్నోగ్రఫీకి చట్టబద్ధత కల్పించాలనే ప్రతిపాదనను ఉక్రెయిన్‌ చట్టసభ్యుడు యారోస్లావ్‌ తీసుకొచ్చారు.

ప్రస్తుతం అనధికారికంగా కొనసాగుతున్న అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాన్ని చట్టపరమైన వ్యవస్థలోకి తీసుకొస్తే.. దానిపై పన్నులు విధించడం ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందని ఆయన చెబుతున్నారు.

ఈ విధంగా ఏటా సుమారు 25 మిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.

వివరాలు 

ఆదాయంతో 30 వేల డ్రోన్లు కొనొచ్చు

పోర్నోగ్రఫీ రంగంపై పన్నుల ద్వారా వచ్చే మొత్తాన్ని యుద్ధ అవసరాలకు వినియోగించవచ్చన్నది ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం.

సుమారు 25 మిలియన్‌ డాలర్ల ఆదాయంతో దాదాపు 30 వేల డ్రోన్లను కొనుగోలు చేయవచ్చని యారోస్లావ్‌ పేర్కొంటున్నారు.

రష్యాతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో డ్రోన్ల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఆదాయ మార్గాన్ని పరిశీలించాలని ఆయన సూచిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నిషేధమే

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో పోర్నోగ్రఫీకి చట్టబద్ధత లేదు. అశ్లీల కంటెంట్‌ను రూపొందించడం, పంపిణీ చేయడం, అలాగే అశ్లీల వీడియోలను కలిగి ఉండటం కూడా చట్టవిరుద్ధమే.

కేసు తీవ్రత, పరిస్థితులను బట్టి నిందితులకు గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అయితే చట్టపరంగా నిషేధం ఉన్నప్పటికీ.. ఉక్రెయిన్‌లో అడల్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం పూర్తిగా కనుమరుగవ్వలేదు. రహస్యంగా ఈ పరిశ్రమ కొనసాగుతూనే ఉంది.

ఈ పరిస్థితుల్లో దాన్ని నియంత్రిత చట్టబద్ధ వ్యవస్థలోకి తీసుకొచ్చి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకోవాలన్న ప్రతిపాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT