ఉక్రెయిన్-రష్యా యుద్ధం: వార్తలు

Ukraine war: అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ .. 158 డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా

ఉక్రెయిన్,రష్యా మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లను ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చి వేసినట్లు సమాచారం.

Ukraine Attack : రష్యాపై 9/11 తరహా దాడి... బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన డ్రోన్

రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి పెద్ద ఎత్తున క్షిపణి, డ్రోన్ దాడులు మొదలయ్యాయి. రష్యా తర్వాత ఉక్రెయిన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది.

Ukraine: జపోరిజియా అణు కర్మాగారంపై డ్రోన్ దాడి.. పరస్పరం నిందించుకొంటున్న రష్యా, ఉక్రెయిన్‌

రష్యా ఆక్రమిత జపోరిజియా అణు కర్మాగారం నుండి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ఈ సమాచారాన్ని పంచుకుంది.

Ukraine-Russia War: రష్యా మళ్లీ దాడులు.. 60 ఉక్రేనియన్ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేత 

రష్యా తన భూభాగంలో సుమారు 60 ఉక్రేనియన్ డ్రోన్‌లను, అనేక క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొంది.

11 Mar 2024

రష్యా

మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి 

రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.

Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి 

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

Kim russia tour: ప్రత్యేక రైలులో రష్యాకు బయలుదేరిన కిమ్.. రేపు పుతిన్‌తో భేటీ!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ ప్రత్యేక రైలులో మాస్కోకు బయలుదేరినట్లు దక్షిణ కొరియా వార్తా పత్రిక చోసున్ ఇల్బో తెలిపింది.

తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి..17మంది మృతి.. కీవ్‌ను బ్లింకెన్‌ సందర్శించినప్పుడే ఘటన 

తూర్పు ఉక్రెయిన్‌లో రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్‌పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 17 మంది మరణించాగా,మరో 32మంది గాయపడ్డారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హత్యకు కుట్ర; మహిళ అరెస్టు 

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర చేసినట్లు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్(ఎస్‌బీయూ) వర్గాలు వెల్లడించాయి.

ఉక్రెయిన్‌ విషయంలో అదే జరిగితే భారత్‌ సంతోషానికి అవధులుండవు: దోవల్ 

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాలు ఘర్షణ విధానానికి స్వస్తి పలికితే అంతకు మించిన సంతోషం భారత్‌కు మరోటి లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. సమస్యలను చర్చలు, దౌత్య మార్గాలతోనే పరిష్కరించాలనేది తమ విధానమని వెల్లడించారు.

25 Jul 2023

రష్యా

రష్యా ఉక్రెయిన్ మధ్య అలజడులు.. కీవ్‌పై రష్యా వైమానిక దాడి 

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. ఉక్రెయిన్‌లోని కీవ్‌ ప్రాంతంపై రష్యా మరోసారి వైమానిక దాడికి దిగింది. ఆరోసారి ఉక్రెయిన్ మిలటరీ విభాగంపై రష్యా వైమానిక దాడులకు పూనుకుంది.

11 Jul 2023

అమెరికా

ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నాన్ని స్వాగతిస్తాం: అమెరికా 

ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికా పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తే తాము తప్పకుండా స్వాగతిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.

ఉక్రెయిన్ రెస్టారెంట్​పై మిసైల్స్​తో విరుచుకుపడ్డ రష్యా.. 11 మంది మరణం, 70 మందికి గాయాలు

ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై మిసైల్స్​తో దాడులకు పూనుకున్న రష్యా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈస్ట్ ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌లోని క్రమాటోర్స్క్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్​ను లక్ష్యంగా చేసుకుంది.

ఉక్రెయిన్‌ రెస్టారెంట్‌పై క్షిపణులతో రష్యా దాడి ; నలుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుపడుతోంది.

08 Jun 2023

రష్యా

ఉక్రెయిన్ లో నీటి యుద్ధం.. నీట మునిగిన ఖేర్సన్‌ నగరం

ఒకప్పుడు బుల్లెట్లు, కత్తులు, కటార్లు, యుద్ధ విమానాలు తదితర వాటిని మాత్రమే శత్రు దేశాలపై ప్రయోగించేవారు. కానీ మారుతున్న కాలంలో వరదనీరు, జలాశయాలు లాంటి పేలుడ్లు ఈ జాబితాలోకి వచ్చి చేరాయి.

05 Jun 2023

రష్యా

వందలాది మంది ఉక్రెయిన్ దళాలను హతమార్చాం: రష్యా బలగాల ప్రకటన 

భారీ స్థాయిలో ఉక్రెయిన్ దాడిని తిప్పికొట్టడంతో పాటు వందలాది మంది ఆ దేశ సైనికులను హతమార్చినట్లు సోమవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ

ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరిని రాహుల్ గాంధీ సమర్థించారు.

25 May 2023

జర్మనీ

మాంద్యంలోకి జర్మన్ ఆర్థిక వ్యవస్థ; వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గిన జీడీపీ

ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ మాంద్యంలోకి ప్రవేశించింది. గత మూడు నెలలతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 0.3శాతం పడిపోయింది.

21 Apr 2023

రష్యా

సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది? 

ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు వెళ్తున్న రష్యా యుద్ధవిమానం అనుకోకుండా సొంత నగరంపై దాడి చేసింది.

25 Mar 2023

రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం!

ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. ఈ క్రమంలో త్వరలో మాస్టర్ ప్లాన్‌తో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రష్యా భావిస్తోంది.

ఐసీసీ వారెంట్: పుతిన్ ఎప్పుడు అరెస్టు అవుతారు? నిపుణులు ఏం అంటున్నారు?

అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పుతిన్ నిజంగా అరెస్టు అవుతారా? ఒకవేళ అరెస్టు అయితే ఎవరు అరెస్టు చేస్తారు?

పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్

ఉక్రెయిన్- రష్యా యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌తో పాటు మరో రష్యా అధికారికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి

ప్రజలు నిద్రిస్తున్న సమయంలో గురువారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణుల ధాటికి కీవ్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు.

రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్‌; భారత్, చైనా దూరం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి శుక్రవారం(ఫిబ్రవరి 24) నాటికి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికైనా రష్యా యుద్ధాన్ని ఆపేసి ఉక్రెయిన్‌ను విడిచి వెళ్లాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానించారు. అయితే రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఓటింగ్‌లో భారత్- చైనా దూరంగా ఉన్నాయి.

21 Feb 2023

రష్యా

'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రహస్య పర్యటనపై రష్యా స్పందించింది. బైడెన్ తమ నుంచి భద్రతా పరమైన హామీని అందుకున్న తర్వాతే ఉక్రెయిన్‌కు బయలుదేరినట్లు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు.

ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన

యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని సందర్శించి ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆయన ఉక్రెయిన్‌కు ఎప్పుడు వెళ్లారు? ఎలా వెళ్లారు? అనేది ఎవరికీ తెలియదు. అంతా రహస్యంగానే సాగింది. రష్యా కళ్లుగప్పి ఆ రహస్య పర్యటన ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

19 Feb 2023

జపాన్

ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే ఉక్రెయిన్‌పై దమనకాండకు దిగిన రష్యాపై మరన్ని ఆంక్షలు విధించాలని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు.

ఉక్రెయిన్ మిత్రదేశం 'మోల్డోవా'పై తిరుగుబాటుకు పుతిన్ ప్లాన్; అమెరికా ఆందోళన

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోల్డోవా దేశంపై తిరుగుబాటుకు కుట్ర పన్నారని వచ్చిన ఆరోపణలపై అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు.

'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు

రష్యాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని మాస్కోలోని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. కొత్తగా వెళ్లే వారు కూడా రష్యాకు వెళ్లవద్దని సూచించింది. అక్రమ నిర్బంధాల కారణంగా అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ క్రమంలో రష్యా సేనలను ధీటుగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఆధునిక ట్యాంకులు, యుద్ధ విమానాలను సాయం చేయాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.