ఉక్రెయిన్‌కు అండగా జీ7 దేశాలు; రష్యాపై మరిన్ని ఆంక్షలు
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో జీ7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ కష్టకాలంలో ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని నిర్ణయించారు. అలాగే ఉక్రెయిన్‌పై దమనకాండకు దిగిన రష్యాపై మరన్ని ఆంక్షలు విధించాలని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. శనివారం జర్మనీలోని మ్యూనిచ్‌లో జీ7 సమావేశాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ భద్రతా అంశంపై చర్చలో భాగంగా జీ7 దేశాలు రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఈ ఏడాది జపాన్ జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశానికి నాయకత్వం వహించనుంది. జపాన్ అధ్యక్ష హోదాలో శనివారం జర్మనీలోని మ్యూనిచ్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాను కూడా ఆహ్వానించారు.
మేము అలసిపోలేదని రష్యా గ్రహించాలి: ఉక్రెయిన్
జపాన్ విదేశాంగ మంత్రి హయాషి యోషిమాసా ఆహ్వానం మేరకు తాను జీ7 సదస్సులో పాల్గొన్నట్లు కులేబా చెప్పారు. 2023లో ఉక్రెయిన్ విజయానికి అవసరమైన సాయంపై తాము దృష్టి పెట్టినట్లు కులేబా పేర్కొన్నారు. తాము అలసిపోదనే విషయాన్ని రష్యా గ్రహించాలని డిమిట్రో కులేబా ట్వీట్ చేశారు. ఉక్రెయిన్‌లోని పౌరులు మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు కొనసాగించడాన్ని జీ7 దేశాల విదేశాంగ మంత్రులు ఖండించారు. జపాన్ మేలో హిరోషిమాలో జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది.