ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఆపేందుకు ఎవరు ముందుకొచ్చిన స్వాగతిస్తామని అమెరికా పేర్కొంది. అయితే భారత ప్రధాని మోదీకి మాత్రం యుద్ధాన్ని ఆపే శక్తి ఉందని వైట్ హౌస్ చెప్పింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఒప్పించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌కు ఇంకా సమయం ఉందని జాన్ కిర్బీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకోల్పడానికి చేపట్టే ఎలాంటి ప్రయత్నాన్నైనా అమెరికా స్వాగతిస్తుందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మాస్కోలో కలిసిన ఒక రోజు తర్వాత జాన్ కిర్బీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఉక్రెయిన్ ప్రజల బాధలకు కారణమైన ఏకైక వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్: అమెరికా
ఉక్రెయిన్ ప్రజలు అనుభవిస్తున్న బాధలకు కారణమైన ఏకైక వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. శక్తివంతమైన బాంబులు, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగిస్తూ ఉక్రెయిన్‌ను సర్వనాశనం నాశనం చేస్తున్నట్లు కిర్బీ చెప్పారు. దేశ పరిస్థితి మరింత దిగజారుతున్న నేపథ్యంలో పుతిన్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చర్చించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నట్లు కిర్బీ పేర్కొన్నారు. అయితే బలమైన మధ్యవర్తి కోసం జెలెన్‌స్కీ ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, రష్యా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఇప్పటికే ప్రధాని మోదీ పలుమార్లు చర్చలు జరిపారు. ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. ముఖ్యంగా ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో షాంఘై సహకార సంస్థ యొక్క శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో పీఎం మోదీ చెప్పిన మాటలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.