ఉక్రెయిన్ లో నీటి యుద్ధం.. నీట మునిగిన ఖేర్సన్ నగరం
ఒకప్పుడు బుల్లెట్లు, కత్తులు, కటార్లు, యుద్ధ విమానాలు తదితర వాటిని మాత్రమే శత్రు దేశాలపై ప్రయోగించేవారు. కానీ మారుతున్న కాలంలో వరదనీరు, జలాశయాలు లాంటి పేలుడ్లు ఈ జాబితాలోకి వచ్చి చేరాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త దారులను వెతుకుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఖేర్సన్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని నీపర్ నదిపై ఉన్న నోవా కఖోవ్కా ప్రాజెక్టును ఎవరో పేల్చివేశారు. ఈ నగరం పశ్చిమ ప్రాంతం ఉక్రెయిన్ అధీనంలో ఉండగా, ఇరు దేశాల యుద్ధం ప్రారంభమైన కొత్తలో తూర్పు ప్రాంతాన్ని రష్యా ఆక్రమించేసింది. మరోవైపు ఖేర్సన్ ప్రాంతం ఈ జలాశయం దిగువ ప్రాంతంలోనే ఉంది. అయితే ఈ డ్యామ్ పేల్చివేత అక్కడ నివసిస్తున్న దాదాపు 60 వేల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి.
పేల్చివేతకు వ్లాదిమిర్ పుతిన్ కారణం : ఉక్రెయిన్
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యం చురుగ్గా స్పందించింది. అనంతరం భారీ సహాయక చర్యల్లోనూ నిమగ్నమైంది. వందలాది బోట్లతో వరద నీటిలో ఉన్న గ్రామాలను, అక్కడి ప్రజల్ని సేఫ్ జోన్లకు తరలిస్తోంది. ఊహించని స్థాయిలో దెబ్బతిన్న పంటలు డ్యామ్ పేల్చివేతతో సుమారు 50 లక్షల హెక్టార్ల మేర భూమి ప్రబావితమైంది. ఈ వరదలతో పంటలన్నీ పూర్తిగా నీట మునిగాయి. రాబోయే కాలంలో సాగునీటికి ఇబ్బందేనని, ఫలితంగా ఈ నేలలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని జనం ఆందోళన పడుతున్నారు. పేల్చివేతపై మాటల తూటాలు జలాశయం పేల్చివేతపై బాధిత ఉక్రెయిన్, రష్యాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో రష్యా సైన్యమే దీనికి కారణమంటూ ఉక్రెయిన్ భావిస్తోంది.
డ్యామ్ పేల్చివేతను ఖండించిన రష్యన్ ప్రెసిడెంట్
ఇదో కిరాతకమైన చర్య : మరోవైపు కీవ్ ఉగ్రవాదులే ఈ పని చేశారని రష్యా ఎదురుదాడి చేస్తోంది. ఈ ఘటనపై బుధవారం టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగాన్‌తో ఫోన్లో మాట్లాడిన వ్లాదిమిర్ పుతిన్ డ్యాం పేల్చివేతను కిరాతక చర్యగా పేర్కొన్నారు. దీనిపై అంతర్జాతీయ నిపుణులతో విచారించాలని ఎర్డోగాన్ అన్నారు. ప్రాజెక్టును మాస్కోనే పేల్చివేసిందని, రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కూడా చేయట్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 వేల మంది ఉండే రష్యా ఆక్రమిత ప్రాంతంలో కేవలం 1300 మందిని మాత్రమే తరలించడం ఏమిటని రష్యాపై జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అక్కడ సాయం కోసం జనం భవనాలపైకెక్కి సాయం కోసం హాహాకారాలు చేస్తున్నారన్నారు.