Trump -Putin: పుతిన్‌కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్.. ఉక్రెయిన్ యుద్ధంపై సలహాలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ఎప్పుడు ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. అయితే పలు దేశాలు ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి, వాటిలో భారత్ కూడా ఒకటి. తాజాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ప్రయత్నాల్లో చేరారు. వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన సమాచారం ప్రకారం,ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేసి,ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు జరిపి సలహాలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయవద్దని కోరుతూ, ఐరోపాలో అమెరికా సైనిక బలగాల ఉనికి గురించి రష్యాను హెచ్చరించారని సమాచారం. ఈ సంభాషణలో ఇరువురు నేతలు ఉక్రెయిన్ వివాదం పరిష్కారం కోసం మార్గాలు చర్చించారు. ఉపఖండంలో శాంతిని నిలుపుకునే కృషిపై కూడా వారు ఆలోచనలు పంచుకున్నారు.
ట్రంప్ పుతిన్ సంభాషణ-ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం
అయితే, ట్రంప్ పుతిన్‌తో సంభాషించడంపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం అందినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. కానీ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ఖండిస్తూ, ఈ ఫోన్ సంభాషణపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని, ఇది తప్పుడు వార్త అని స్పష్టం చేసింది. రష్యా అయితే, ఉక్రెయిన్ వివాదంపై ట్రంప్‌తో చర్చించడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. కానీ ఈ దాని వల్ల రష్యా తన డిమాండ్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని భావించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పుతిన్-ట్రంప్ మధ్య ఫోన్ సంభాషణ అధికారికంగా ధృవీకరించబడలేదు.