Russia-Ukraine war: ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా కీలక సమావేశాలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో, కీవ్ పై మాస్కో వైమానిక దాడులతో తీవ్రంగా విరుచుకుపడుతోంది.
ఉక్రెయిన్‌కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని రష్యా దళాలు దాడులు నిర్వహించాయని కీవ్ మేయర్ విటాలి కీచ్‌కోస్ తెలిపారు.
రష్యా (Russia) తమపై బాలిస్టిక్ క్షిపణులు, బహుళ రాకెట్లు ప్రయోగించిందని కీచ్‌కోస్ వెల్లడించారు.
అయితే, ఉక్రెయిన్ దళాలు వీటిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కీవ్ నగరం మరియు పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వివరాలు
దాడుల్లో 14 మంది మరణం
ఈ యుద్ధం ముగింపు కోసం సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధులు కీలక చర్చలు జరుపనున్నట్లు సమాచారం.
అయితే, ఈ సమయంలోనే రష్యా దాడులు ముమ్మరంగా కొనసాగించడం గమనార్హం.
ఇటీవల కూడా రష్యా, ఉక్రెయిన్‌లోని డోబ్రోపిలియా, ఖార్కివ్ ప్రాంతాల్లో క్షిపణులు, డ్రోన్ల ద్వారా దాడులు చేపట్టింది.
ఈ దాడుల్లో 14 మంది మరణించగా, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా, ఎనిమిది బహుళ అంతస్తుల భవనాలు మరియు 30కి పైగా వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రజలను రక్షించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) తమ వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
వివరాలు
అమెరికా,ఐరోపా దేశాలు కీలక సమావేశాలు
ఇక, యుద్ధ ముగింపుకు అమెరికా (USA) ఐరోపా దేశాలు కీలక సమావేశాలు నిర్వహించనున్నాయి.
ఈ చర్చలు సౌదీ అరేబియాలో జరగనున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచి, మాస్కో దాడులను అడ్డుకోవడానికి ఐరోపా దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
అంతేకాదు, అమెరికా సహాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతు పెంచేందుకు దేశాలు వ్యూహరచన చేస్తున్నాయి.