
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం!
ఈ వార్తాకథనం ఏంటి
ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. ఈ క్రమంలో త్వరలో మాస్టర్ ప్లాన్‌తో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రష్యా భావిస్తోంది.
వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలికేందుకు 4,00,000 మంది సైనికులను రిక్రూట్ చేసుకునే పనిలో రష్యా ఉందని సమాచారం. ఆ 4లక్షల మంది సైనికులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలు రష్యాను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తుంటే, ఈ నెలలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాస్కోకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఇటీవల జిన్‌పింగ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.
రష్యా
సైనికులను రిక్రూట్ చేసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందట
అయితే పుతిన్ ఒకేసారి రికార్డు స్థాయిలో 4లక్షల మంది సైనికులను రిక్రూట్ చేసుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం పుతిన్ తిరిగి అధ్యక్షుడిగా మరోసారి ఎన్నిక కానున్నారు. ఈ క్రమంలో వ్యతిరేకత వ్యక్తం కాకుండా, ప్రజలను బలవంతంగా సైన్యంలోకి తీసుకురాకుండా కాంట్రాక్ట్ పద్దతిని భారీగా సైనిక నియామకాలు చేట్టాలని పుతిన్ భావిస్తున్నారు.
యువకులు, విద్యార్థులను బలవంతంగా ఆర్మీలోకి రిక్రూట్ చేసుకోవడం వల్ల మిలియన్ల మంది రష్యన్లు దేశం విడిచి వలస వెళ్లారు.
ఉక్రేనియన్‌తో పాటు పాశ్చాత్య అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం రష్యాలో 300,000 మంది రష్యా సైనికులు ఉన్నారు. అయినా రష్యా ఇటీవలి నెలల్లో పెద్ద పట్టణాలను స్వాధీనం చేసుకోవడంలో పుతినే సేనలు విఫలమయ్యాయి.
రష్యా
మరోసారి అధ్యక్షుడిగా నియామకం అయ్యే సమయానికి యుద్ధాన్ని ముగించే ఆలోచనలో పుతిన్
ఉక్రెయిన్ కూడా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తన ప్లాన్‌లో అది ఉంది. యూరప్‌తోపాటు యూఎస్‌లో శిక్షణ పొందిన సైనికులు, కొత్తగా సరఫరా చేయబడిన ట్యాంకులు, సాయుధ వాహనాలు, ఇతర ఆయుధాలను ఉపయోగించి రాబోయే రోజుల్లో పుతిన్ సేనలను నిరోధించాలని ఉక్రెయిన్ భావిస్తోంది.
రష్యా ఇప్పటికే కాంట్రాక్ట్ సైనికుల కోసం నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే 400,000 మంది కాంట్రాక్ట్ సైనికులను నియమించుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రష్యా అధికారులు కొట్టిపారేశారు. అది అవాస్తమని చెప్పారు.
పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా నియామకం అయ్యే సమయానికి ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించి, విజయగర్వంతో పదవీ బాధ్యతలు చేపట్టాలన్న లక్ష్యంతో కొత్త నియామకాలకు తెరలేపారనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.