పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు; సమర్థించిన బైడెన్
ఉక్రెయిన్- రష్యా యుద్ధం భీకరంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా తిరుగుబాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌తో పాటు మరో రష్యా అధికారికి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) శుక్రవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు యుద్ధ నేరాల ఆరోపణలపై ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ది హిల్ వార్తాపత్రిక నివేదించింది. యుద్ధ నేరాల కోసం పుతిన్‌ను విచారించాలా అని విలేకరులు అడిగినప్పుడు బైడెన్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. అయితే పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు
ఐసీసీ వారెంట్‌ను గుర్తించడం లేదని చెప్పిన రష్యా
ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగం నుంచి పిల్లలను బలవంతంగా రష్యాకు తరలించినట్లు ఐసీసీ ఆరోపిస్తోంది. దీనికి రష్యా అధ్యక్షుడితో పాటు ప్రతి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీపై రష్యా స్పందించింది. తాము ఐసీసీ వారెంట్‌ను గుర్తించడం లేదని తేల్చి చెప్పింది. దీన్ని ఆమోదయోగ్యం కానీ చర్యగా అభివర్ణించింది. ఇదిలా ఉండే, ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలోని ఐదు సభ్యదేశాల్లో ఒక దేశాధినేతకు అరెస్టు వారెంట్ జారీ చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.