
ఉక్రెయిన్ రెస్టారెంట్‌పై క్షిపణులతో రష్యా దాడి ; నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. క్షిపణులతో విరుచుపడుతోంది.
తాజాగా తూర్పు ఉక్రెయిన్ నగరమైన క్రామాటోర్స్క్‌ను రెండు రష్యా క్షిపణులు ఢీ కొన్నాయి. ఈ దాడిలో నలుగురు గాయపడ్డారు. మరో 42మంది గాయపడ్డారు.
మొదటి క్షిపణి రెస్టారెంట్‌ను ఢీకొట్టింది. దీంతో రెస్టారెంట్ భవనం ధ్వంసమైంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.
రెండో క్షిపణి క్రామాటోర్స్క్ శివార్లలోని ఓ గ్రామాన్ని ఢీకొట్టింది. ఈ రెండు చోట్ల కలిపి నలుగురు చనిపోయారు.
అలాగే ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న క్రెమెన్‌చుక్ నగరాన్ని రష్యన్ క్షిపణి ఢీకొంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
క్రెమెన్‌చుక్‌లోని ఒక షాపింగ్ మాల్‌పై ఏడాది క్రితం కూడా రష్యా క్షిపణులతో దాడి చేసింది. ఈ డాదిలో 20మంది చనిపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రష్యా దాడిలో ధ్వంసమైన రెస్టారెంట్
Russian missiles strike restaurant in Kramatorsk. First responders are still looking for survivors in the debris. pic.twitter.com/n6PyrillcL #Breaking #Ukraine
— Informer Daily (@X_Informer_X) June 27, 2023