తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి..17మంది మృతి.. కీవ్‌ను బ్లింకెన్ సందర్శించినప్పుడే ఘటన
తూర్పు ఉక్రెయిన్‌లో రద్దీగా ఉండే బహిరంగ మార్కెట్‌పై రష్యా క్షిపణి దాడి చేయడంతో కనీసం 17 మంది మరణించాగా,మరో 32మంది గాయపడ్డారు. US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ అనుకోకుండా ఉక్రెయిన్ పర్యటన కై కైవ్ ను సందర్శించినప్పుడు ఈ దాడి జరిగింది. కోస్టియాంటినివ్కా నగరంలో జరిగిన దాడిని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఖండించారు. కోస్టియాంటినివ్కా,బఖ్‌ముట్ నగరం నుండి 20 మైళ్ల(30 కిమీ)దూరంలో ఉంది. కోస్టియాంటినివ్కాలో యుద్ధానికి ముందు సుమారు 70,000 జనాభా ఉండేవారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు క్షిపణి ఢీకొనడంతో దాదాపు 30 స్టాళ్లు, ఫార్మసీ,అపార్ట్‌మెంట్ బ్లాక్, బ్యాంక్,అనేక కార్లు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.ఈ క్షిపణి దాడిలో 30మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.