ఉక్రెయిన్ రెస్టారెంట్‌పై మిసైల్స్‌తో విరుచుకుపడ్డ రష్యా.. 11 మంది మరణం, 70 మందికి గాయాలు
ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో దాడులకు పూనుకున్న రష్యా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈస్ట్ ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 2 క్షిపణులను ప్రయోగించారు.ఈ దాడిలో 11 మంది మరణించారు. దాదాపు 70 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం కలవరానికి గురిచేస్తోంది. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని ఆ దేశ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ నేషనల్ పోలీసులు దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని, ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తి రష్యాకు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు అనుమానితుడ్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. అకారణంగా అమాయకుల ప్రాణాలను తీస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా తీరుపై ధ్వజమెత్తారు.
జర్నలిస్టులు, సైనికులే లక్ష్యంగా రష్యా దాడులు
మొదటి క్షిపణ పిజ్జా రెస్టారెంట్‌ను, రెండోది క్రమాటోర్స్క్ నగర శివార్లలోని గ్రామాన్ని అల్లకల్లోం చేశాయి. క్రమాటోర్స్క్ దాడిలో 18 అంతస్తుల భవనాలు, 65 ఇళ్లు, 5 పాఠశాలలు, 2 కిండర్ గార్డెన్స్, ఓ షాపింగ్ కాంప్లెక్స్ సహా ఎన్నో కీలక భవనాలను ధ్వంసమయ్యాయి. ఈ మేరకు ఉక్రెయిన్ రీజినల్ గవర్నర్ పావ్లో కైరిలెంకో వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నామని చెప్పారు. ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సదరు రెస్టారెంట్‌కు జర్నలిస్టులు, సైనికులు ఎక్కువగా వస్తుంటారని, వీరందరిని రష్యా లక్ష్యంగా చేసుకునే దాడి చేసిందని ఉక్రెయిన్ పోలీసులు పేర్కొన్నారు.