ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉక్రెయిన్ విషయంలో భారత వైఖరిని రాహుల్ గాంధీ సమర్థించారు.
10రోజుల పర్యటన నిమిత్త అమెరికాకు వెళ్లిన రాహుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో జరిగిన ఇంటరాక్షన్‌లో ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో పాటు పలు అంశాలపై మాట్లాడారు.
రష్యా- ఇండియా మధ్య మంచి సంబందాలు ఉన్నాయని, అంతిమంగా దేశ ప్రయోజనాలనే పరిగణనలోకి భారత్ తీసుకుందని స్పష్టం చేశారు.
భారతదేశం ఎల్లప్పుడూ అగ్రదేశాలతో సంబంధాలు కలిగి ఉంటుందని రాహుల్ అన్నారు.
అలాగే కొన్ని దేశాలతో మెరుగైన సంబంధాలను కొనసాగిస్తామని, ఇతర దేశాలతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటామని పేర్కొన్నారు.
రాహుల్
నాపై అనర్హత వేటు పడుతుందని ఊహించలేదు: రాహుల్
లోక్‌సభలో తనపై వేసిన అనర్హత వేటుపై కూడా కాంగ్రెస్ నేత రాహుల్ మాట్లాడారు. 2004లో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పార్లమెంటుకు అనర్హుడవుతానని ఊహించలేదని అన్నారు.
పరువు నష్టం కేసులో చట్టసభకు అనర్హుడైన మొదటి వ్యక్తిని తానేనని, ఇలాంటి శిక్షను తాను ఎన్నడూ ఊహించలేదన్నారు.
అయితే ఇది తనకు వచ్చిన సువర్ణవకాశంగా రాహుల్ చెప్పకొచ్చారు. పార్లమెంటులో చేసే పోరాటం కంటే, ఇదే తనకు పెద్ద అవకాశం ఇచ్చిందన్నారు.
భారతదేశం వెలుపలి నుంచి తాను ఎవరి మద్దతును కోరుకోవడం లేదని ఈ సందర్భంగా రాహుల్ స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన విద్యార్థులకు దగ్గరయ్యేందుకే తాను అమెరికాకు వచ్చినట్లు రాహుల్ చెప్పుకొచ్చారు.