Page Loader
Ukraine war: అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ .. 158 డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా
అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ .. 158 డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా

Ukraine war: అర్ధరాత్రి విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌ .. 158 డ్రోన్లను ధ్వంసం చేసిన రష్యా

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2024
12:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్,రష్యా మధ్య డ్రోన్ యుద్ధం కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లను ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చి వేసినట్లు సమాచారం. మాస్కోలోని రెండు ప్రాంతాలు, మరొక 9 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి, కానీ ప్రాణ నష్టం జరగలేదని రష్యా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. కస్క్ ప్రాంతంలో 46 డ్రోన్లు, బ్రియాన్స్క్‌లో 34, వోరోనెజ్‌లో 28, బెల్గోరోడ్‌లో 14 డ్రోన్ల దాడులు జరిగాయి. ఇవి అన్నీ ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలే. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా లోపల కూడా చొచ్చుకెళ్లి త్వెర్, ఇవానోవో ప్రాంతాల్లో దాడులు జరిపాయి. రష్యా 11 డ్రోన్లను ప్రయోగించిందని, అందులో ఎనిమిది డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది.

వివరాలు 

రష్యా ప్రతీకార చర్య..  ఆరు డ్రోన్లతో..

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నడుస్తున్న డ్రోన్ల యుద్ధం సోమవారం కూడా కొనసాగింది. శనివారం రాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లను ప్రయోగించిన తరువాత, రష్యా ప్రతీకార చర్యగా ఆరు డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ డ్రోన్లు క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులతో పాటు విస్ఫోటకాలను మోహరించాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ దేశ వైమానిక దళం తెలిపింది. కీవ్ లో పలు చోట్ల శక్తివంతమైన పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కీవ్ లోని హోలోసివ్‌స్కీ, సోలోమియన్‌స్కీ జిల్లాల్లో ఎమర్జెన్సీ సేవలు ప్రారంభించారు. రష్యా తాజా దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

వివరాలు 

మాస్కోతో పాటు మరో 9 ప్రాంతాలలో దాడులు

''ప్రతి దాడికి ప్రతిస్పందన ఉంటుంది. శత్రువును ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకుంటాం'' అని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ చెప్పారు. శనివారం రాత్రి ఉక్రెయిన్ 158 డ్రోన్లను ప్రయోగించగా, రష్యా వాటిలో చాలానే కూల్చి వేసింది. మాస్కోతో పాటు మరో 9 ప్రాంతాలలో ఈ దాడులు జరిగాయి. అయితే, ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా రక్షణశాఖ అధికారులు తెలిపారు. కస్క్‌లో 46, బ్రియాన్స్క్‌లో 34, వోరోనెజ్‌లో 28, బెల్గోరోడ్‌లో 14 డ్రోన్ల దాడులు జరిగాయి. ఇవన్నీ ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలే. రష్యా లోపల కూడా ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు జరిగాయి, అందులో మాస్కోకు సమీపంలోని త్వెర్, ఇవానోవో ప్రాంతాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రష్యన్ ఎనర్జీ ప్లాంట్ పై దాడి