LOADING...
ఉక్రెయిన్‌ విషయంలో అదే జరిగితే భారత్‌ సంతోషానికి అవధులుండవు: దోవల్ 
ఉక్రెయిన్‌ అంశంపై సదస్సు.. అదే జరిగితే భారత్‌ సంతోషానికి అవధుల్లేవ్

ఉక్రెయిన్‌ విషయంలో అదే జరిగితే భారత్‌ సంతోషానికి అవధులుండవు: దోవల్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 06, 2023
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై ఇండియా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరుదేశాలు ఘర్షణ విధానానికి స్వస్తి పలికితే అంతకు మించిన సంతోషం భారత్‌కు మరోటి లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రకటించారు. సమస్యలను చర్చలు, దౌత్య మార్గాలతోనే పరిష్కరించాలనేది తమ విధానమని వెల్లడించారు. సౌదీఅరేబియాలోని జెడ్డాలో ఉక్రెయిన్‌-రష్యా అంశంపై పలు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం జరిగింది. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సహా 42దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజిత్ దోవల్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్ ప్రయతిస్తోందని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి భారత్ ప్రయత్నిస్తోందని దోవల్ స్పష్టం చేశారు. శాంతిని నెలకోల్పేందుకు దౌత్యమే సరైన మార్గమని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సౌది  అరేబియాలో సదస్సుకు హాజరైన దోవల్‌కు స్వాగతం పలుకుతున్న దృశ్యం