
Putin: పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. పశ్చిమ దేశాలకు అణు హెచ్చరికలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతోంది. ఇటీవల ఉక్రెయిన్ రష్యాపై దాడులను మరింత వేగవంతం చేసింది.
ఈ పరిస్థితిలో, ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ అంశంపై, నాటో దేశాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి హెచ్చరికలు చేశారు.
పశ్చిమ దేశాలపై అణ్వాయుధ దాడి చేసే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.
అమెరికా, యూకే సహకారంతో ఉక్రెయిన్ రష్యాపై తీవ్రమైన దాడులు చేస్తోంది.
ఇటీవల, యూకే రష్యాపై బాంబు దాడులకు ఉపయోగించే 'స్టార్మ్ షాడో' క్రూయిజ్ క్షిపణిని మంజూరు చేసింది.
వివరాలు
యూకే ప్రధాని,అమెరికా అధ్యక్షుడు చర్చలు
యూకే ప్రధాని కైర్ స్టార్మర్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసేందుకు వాషింగ్టన్ వెళ్లారు.
రష్యా గడ్డపై ఉక్రెయిన్ ఆయుధ వినియోగంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం.
దీనిపై రష్యా ఇంటెలిజెన్స్ గమనించి, వెంటనే రష్యా పశ్చిమ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది.
రష్యా భద్రతా మండలిలో ఇటీవల జరిగిన సమావేశంలో పుతిన్ కీలక ప్రకటన చేశారు.
అణు సామర్థ్యం లేని దేశం, అణు సామర్థ్యం కలిగిన దేశం మద్దతుతో రష్యాపై దాడి చేస్తే, దానిని రష్యాపై సంయుక్త దాడిగా పరిగణిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా, రష్యా అణ్వాయుధాలను ఉపయోగించడంలో వెనుకడబడబోమని స్పష్టం చేశారు.
వివరాలు
డ్రోన్లు ప్రయోగిస్తే, రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధం
పుతిన్ హెచ్చరికల తర్వాత, రష్యా తన అణు విధానంలో మార్పులు చేసింది. కొత్త మార్పుల ప్రకారం, ప్రతిపక్ష దేశాలు భారీ విమాన దాడులు చేయడం లేదా క్రూజ్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తే, రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంటుంది.
పశ్చిమ దేశాలు తమ ఆయుధాలతో ఉక్రెయిన్ రష్యాపై దాడి చేయడానికి అనుమతిస్తే, ఆ యుద్ధంలో నాటో కూడా భాగస్వామిగా పరిగణిస్తామని పుతిన్ స్పష్టం చేశారు.