Page Loader
Zelensky: రష్యా కోసం..ఉక్రెయిన్‌కు చేరుకున్న10,000 ఉత్తర ఉత్తర కొరియన్ సైనికులు: జెలెన్స్కీ  
రష్యా కోసం..ఉక్రెయిన్‌కు చేరుకున్న10,000 ఉత్తర ఉత్తర కొరియన్ సైనికులు: జెలెన్స్కీ

Zelensky: రష్యా కోసం..ఉక్రెయిన్‌కు చేరుకున్న10,000 ఉత్తర ఉత్తర కొరియన్ సైనికులు: జెలెన్స్కీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 18, 2024
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సుదీర్ఘకాలంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేలాదిమంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు చేశారు. ఉత్తర కొరియా నుంచి 10 వేల మంది సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని నాటో ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడినప్పుడు వెల్లడించారు.

వివరాలు 

నాటో సభ్య దేశాల్లో ఉక్రెయిన్‌కు సభ్యత్వానికి అర్హత

జెలెన్‌స్కీ మాట్లాడుతూ, "ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉత్తర కొరియాకు చెందిన వ్యూహాత్మక సిబ్బంది, అధికారులను రష్యా పంపినట్లు మా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఉత్తర కొరియాకు చెందిన 10 వేల మంది సైనికులు వారి స్వదేశంలో శిక్షణ పొందుతున్నారు. మా రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మూడో దేశం పాల్గొనడం ప్రపంచయుద్ధానికి దారితీస్తుంది" అని అన్నారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి తన విజయ ప్రణాళికను చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ నాయకులు,నాటో రక్షణ మంత్రులతో చర్చించడానికి జెలెన్‌స్కీ బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తన విజయ ప్రణాళికను అమలుచేస్తే వచ్చే ఏడాదిలోగా ఈ యుద్ధం ముగుస్తుందని చెప్పారు. అదేవిధంగా, నాటో సభ్య దేశాల్లో ఉక్రెయిన్‌కు సభ్యత్వానికి అర్హత ఉందని పేర్కొన్నారు.

వివరాలు 

 జెలెన్‌స్కీ ఆరోపణలపై స్పందించిన నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్టే 

ఇదిలాఉండగా, జెలెన్‌స్కీ చేసిన ఆరోపణలపై నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్టే స్పందించారు. యుద్ధంలో ఉత్తర కొరియా పాల్గొంటున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాల సరఫరాతో వారికి మద్దతిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు అందించే సైనికులు, వాయు, రక్షణ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి, క్షిపణుల వంటి సాయాన్ని వేగవంతం చేయాలని ప్రపంచ దేశాల నాయకులు పిలుపునిచ్చారు. నాటోలో ఉక్రెయిన్‌కు స్థానం ఉందని, కానీ అది ఎప్పుడు చేరుతుందో చెప్పలేమని పునరుద్ఘాటించారు. 32 మిత్ర దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ గెలుపునకు సహకరిస్తాయని తెలిపారు.