Plane Crash: రష్యాలో ఘోర ప్రమాదం..కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా సైన్యానికి చెందిన రవాణా విమానం కుప్పకూలడంతో మొత్తం 29 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటనపై రష్యా మీడియా,విదేశాంగ శాఖ అధికారులను ఉటంకిస్తూ వివరాలు వెల్లడించింది. అధికారుల సమాచారం ప్రకారం.. రష్యా సైనిక విభాగానికి చెందిన ఏఎన్-26 రవాణా విమానం క్రిమియా ప్రాంతం మీదుగా ప్రయాణిస్తోంది. ప్రయాణం మధ్యలో విమానంతో కమ్యూనికేషన్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. కొద్ది సేపటికే విమానం కుప్పకూలినట్లు గుర్తించారు.
వివరాలు
ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమై ఉండచ్చు: రష్యా రక్షణశాఖ
ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 23 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 29 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. విమానంపై ఎలాంటి దాడి జరిగిందన్న ఆధారాలు ఇప్పటివరకు లభించలేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను వెలికితీసేందుకు విచారణ కొనసాగుతోంది.