USA: అమెరికా నుంచి 4,840 మంది భారతీయులు వెనక్కి.. విదేశాంగ శాఖ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమంగా లేదా వలస నిబంధనలను ఉల్లంఘించి ఉన్న భారతీయులపై కొనసాగుతున్న చర్యల్లో భాగంగా, 2025 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూలై వరకు మొత్తం 4,840 మంది భారతీయులను అమెరికా ప్రభుత్వం స్వదేశానికి పంపించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం, 2025 సంవత్సరంలో ఒక్క ఏడాదిలోనే 3,567 మంది భారతీయులు అమెరికా నుంచి తిరిగి భారత్‌కు పంపించారు. ఇక 2026 జనవరి నుంచి జూలై వరకు మరో 1,273 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.
వివరాలు
సంప్రదింపులు కొనసాగిస్తున్నాం
భారతీయులను స్వదేశానికి పంపించే అంశంపై అమెరికాతో పాటు ఇతర దేశాల ప్రభుత్వాలతోనూ నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.
ఈ తరహా కేసులు తమ దృష్టికి వచ్చిన ప్రతిసారీ, సంబంధిత వ్యక్తులు నిజంగా భారతీయులేనా అనే విషయాన్ని పూర్తిస్థాయిలో ధ్రువీకరిస్తున్నామని పేర్కొంది.
సంబంధిత వ్యక్తుల భారత పౌరసత్వాన్ని నిర్ధారించిన తర్వాత మాత్రమే వారిని భారత్‌కు పంపించేందుకు అనుమతి ఇస్తున్నామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.