తదుపరి వార్తా కథనం
Saudi Arabia: సౌదీఅరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం..42 మంది భారతీయులు మృతి..!
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 17, 2025
09:06 am
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలో ఒక భయానక రోడ్డు ప్రమాదం సంభవించింది. భారతీయ యాత్రికులను తీసుకెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో, 42 మంది అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. మరణించిన వారిలో పెద్ద సంఖ్యలో హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారే ఉన్నారని తెలుస్తోంది. మక్కా నుండి మదీనా వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు వెల్లడైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సౌదీఅరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం
#BREAKING | 42 Indian Umrah pilgrims feared dead after bus collides with diesel tanker near Madinah#Umrah #Mecca #Madinah #Accident #Indian #Death https://t.co/NULqg8DDuH
— Mathrubhumi English (@mathrubhumieng) November 17, 2025