Page Loader
Southafrica: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 45 మంది దుర్మరణం 
Southafrica: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 45 మంది దుర్మరణం

Southafrica: దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 45 మంది దుర్మరణం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 29, 2024
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌత్ ఆఫ్రికాలో జరిగిన బస్సు ప్రమాదంలో 45మంది మరణించారు.బస్సులో డ్రైవర్‌తో కలిపి మొత్తం 46మంది ఉన్నారు. ఈప్రమాదంలో ఎనిమిదేళ్ల చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లింపోపోలోని ఈశాన్య ప్రావిన్స్‌లోని మమట్లకల సమీపంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వంతెనపై ఉన్న బారియర్‌లను ఢీకొట్టడంతో బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయని రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణీకుల బస్సు దక్షిణాఫ్రికాలోని బోట్సువానా నుంచి మొరియా పట్టణానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. బ్రిడ్జి పై నుంచి బస్సు కింద పడి నేలను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. దీంతో ప్రమాదంలో మరణించిన కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. కొన్నిమృతదేహాలు శిథిలాల కింద చిక్కుకుపోగా మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బస్సు లోయలో పడి 45మంది మృతి